లేఖన కథలు
యేసు క్రీస్తు మరలా వస్తారు—యేసు క్రీస్తులో నిరీక్షణ గురించి యోహాను యొక్క దర్శనం


ప్రకటన

యేసు క్రీస్తు మరలా వస్తారు.

యేసు క్రీస్తులో నిరీక్షణ గురించి యోహాను యొక్క దర్శనం

యేసు క్రీస్తు పక్కన యోహాను నిలబడి ఉన్నాడు.

అపొస్తలుడైన యోహానుకు ఒక ప్రత్యేక దర్శనం కలిగింది. అతను యేసు క్రీస్తును చూశాడు, ఆయన యోహానుకు గతం మరియు భవిష్యత్తు గురించి చాలా విషయాలు చూపించారు. తాను చూసిన వాటిని వ్రాయమని యోహానుతో చెప్పారు. పరిశుద్ధులు తనను అనుసరించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని యేసుకు తెలుసు. లోకంలోని చెడు కంటే తాను శక్తివంతుడనే నిరీక్షణ వారికి ఉండాలని యేసు కోరుకున్నారు.

ప్రకటన 1:1–2, 9–11, 13–15, 19; 2–3

యేసు క్రీస్తు భుజంపై చేయి వేసుకున్న పరలోక తండ్రి.

యోహాను తన దర్శనంలో ఎవరూ తెరవలేని ఒక గ్రంథపు చుట్టను చూశాడు. అప్పుడు యోహాను యేసు క్రీస్తును సూచించే ఒక గొర్రెపిల్లను చూశాడు; ఆయన ఆ పుస్తకాన్ని తెరవగలిగాడు. భూమి సృష్టించబడక ముందే, పరలోక తండ్రి యేసును మన రక్షకుడిగా ఎంచుకున్నారని యోహాను తెలుసుకున్నాడు. ఇది దేవుని ప్రణాళికలో అతి ముఖ్యమైన భాగం, మరియు యేసు మాత్రమే దానిని చేయగలరు.

ప్రకటన 5

అపవాది మరియు ఒక ఆత్మీయ పిల్లల సమూహము పరలోమును విడిచి వెళ్తున్నారు.

యోహాను అపవాదిని సూచించే ఒక ఘటసర్పాన్ని కూడా చూశాడు. అపవాదికి దేవుని ప్రణాళిక నచ్చలేదు. అతను పరలోకంలో యుద్ధం ప్రారంభించాడు. పరలోక తండ్రి యొక్క ఆత్మీయ పిల్లలలో చాలామంది యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయనను అనుసరించాలని ఎంచుకున్నారు. కానీ వారిలో కొందరు అపవాదిని అనుసరించాలని ఎంచుకున్నారు. వారి ఎంపిక కారణంగా, వారు స్వర్గాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది.

ప్రకటన 12:3–11

కవాతు చేస్తున్న సైనికులు, అవసరంలో ఉన్న ప్రజలు మరియు కరువును చూపించే మిశ్రమ చిత్రం.

అపవాది మరియు అతని అనుచరులు భూమిపై యేసు మరియు ఆయన అనుచరులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారని యోహాను చూశాడు. వారు ప్రజలను రక్షకుని సువార్తను నమ్మకుండా మోసగించడానికి ప్రయత్నించారు. చాలా యుద్ధం, విధ్వంసం, అనారోగ్యం జరిగాయి.

ప్రకటన 6; 8–9; 12:17; 13:11–18; 17–18

జోసెఫ్ స్మిత్‌ను బంగారు పలకల వద్దకు నడిపిస్తున్న దేవదూత మొరోనై.

కానీ పరలోక తండ్రి పరలోకం నుండి యేసు క్రీస్తు సువార్తను దేవదూతలతో పంపారు, తద్వారా భూమిపై ఉన్న ప్రతి ఒక్కరితో సువార్తను పంచుకోవచ్చు.

ప్రకటన 14:6–7

సంస్కారములో పాలుపంచుకుంటున్న ఒక కుటుంబం.

కొంతమంది యేసును విశ్వసించి, వారు పరలోకంలో చేసినట్లుగానే ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. యేసును గూర్చిన వారి సాక్ష్యం యుద్ధంలో అపవాదిపై విజయం సాధించడానికి వారికి సహాయపడుతుంది.

ప్రకటన 12:11; 19:8–10

యేసు పరలోకం నుండి దిగివస్తున్నారు, ఆయన వెనుక దేవదూతలు ఉన్నారు.

యేసు క్రీస్తు మరలా భూమిపైకి వస్తారు అని యోహాను చూశాడు. ఆయన సమస్త ప్రపంచానికి రాజు అవుతారు. అపవాదికి ఇక శక్తి ఉండదు. యేసు కారణంగా, ఇక దుఃఖం లేదా బాధ ఉండదు. యేసును విశ్వసించి ఆయన నిబంధనలను పాటించే ప్రజలందరూ ఆయనతో మరియు పరలోక తండ్రితో శాశ్వతంగా జీవిస్తారు.

ప్రకటన 19:11–16; 20:1–2; 21:1–7