లూకా 10:38–42
మార్త మరియు మరియ
అత్యంత ముఖ్యమైనదానిని ఎంచుకోవడం
మార్త బేతనియ అనే గ్రామంలో నివసించేది. యేసు మరియు ఆయన శిష్యులు బేతనియకు వచ్చినప్పుడు, మార్త వారిని తన ఇంటిలోనికి స్వాగతించింది.
లూకా 10:38
యేసు బోధిస్తున్నప్పుడు, మార్త తన అతిథులకు సేవ చేయడంలో నిమాగ్నమై ఉంది. ఆమె సహోదరి మరియ, యేసు దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటున్నది.
లూకా 10:39–40
అన్ని పనులు తానే ఒంటరిగా చేస్తున్నందుకు మార్త సంతోషంగా లేదు. యేసు మాటలు వినడానికి బదులుగా మరియ తనకు సహాయం చేయాలని ఆమె అనుకుంది. తనకు సహాయం చేయమని మరియకు చెప్పమని మార్త యేసును అడిగింది.
లూకా 10:40
మార్త ఎంత కష్టపడి పనిచేస్తుందో యేసు చూడగలిగారు. ఆమె చాలా విషయాల గురించి ఆందోళన చెందుతుందని తాను గమనించినట్లు ఆయన ఆమెకు చెప్పారు.
లూకా 10:41
కొన్ని విషయాలు ఇతర విషయాలకన్నా ముఖ్యమైనవని యేసు వివరించారు. మరియ, తన మాటలు వినడానికి మంచి ఎంపిక చేసుకుందని ఆయన అన్నారు. యేసు నుండి ఆమె నేర్చుకుంటున్న విషయాలు ఆమె నుండి ఎన్నటికీ తీసివేయబడవు.
లూకా 10:42