లేఖన కథలు
యేసు క్రీస్తునందు విశ్వాసంతో జీవించడం—“మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించువాడు” అయనే


హెబ్రీయులకు 11–12

యేసు క్రీస్తునందు విశ్వాసంతో జీవించడం

“మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించువాడు” అయనే

ఒక పురుషుడు మరియు ఒక బాలిక ప్రజలు తమ కుండలను ధ్వంసం చేయడాన్ని గమనిస్తున్నారు.

సంఘము యొక్క ప్రారంభ రోజులలో ఎల్లప్పుడూ యేసుక్రీస్తును అనుసరించడం సులభం కాదు. ప్రజలు కొన్నిసార్లు సంఘ సభ్యులను అసహ్యించుకుంటారు లేదా వారి నమ్మకాల కారణంగా వారిని ఎగతాళి చేసేవారు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి వారికి సహాయం చేయాలని పౌలు కోరుకున్నాడు.

హెబ్రీయులకు 10:32–39

ప్రార్ధన చేస్తున్న వ్యక్తి మరియు బాలిక, పౌలు ముందుభాగంలో ఉన్నారు.

పౌలు హెబ్రీ, లేదా యూదు, పరిశుద్ధులకు ఒక లేఖ వ్రాశాడు. విశ్వాసం అంటే మనం చూడలేనప్పటికీ, దేనినైనా విశ్వసించడం మరియు ఆశించడం అని ఆయన బోధించాడు. ఉదాహరణకు, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే, మనం ఆశించే ఆశీర్వాదాలను మనం ఇంకా పొందకపోయినా ఆయనను మరియు ఆయన వాగ్దానాలను విశ్వసించడం.

హెబ్రీయులకు 11:16

ఆ వ్యక్తి విశ్వాసం ఉన్న వ్యక్తుల గురించి కథలు చదువుతున్నప్పుడు అమ్మాయి నవ్వుతోంది.

హెబ్రీ పరిశుద్ధులకు విశ్వాసంతో వారి సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయం చేయడానికి, పౌలు వారికి గొప్ప విశ్వాసం ఉన్న లేఖనాలలోని వ్యక్తుల గురించిన కథలను గుర్తు చేశాడు.

హెబ్రీయులకు 11:4–40

ఓడను నిర్మించడానికి సూచనల కొరకు చూస్తున్న నోవహు

ఉదాహరణకు, పౌలు నోవహు గురించి చెప్పారు. దేవుడు, ప్రళయం నుండి తన కుటుంబాన్ని రక్షించడానికి ఒక నౌక నిర్మించమని నోవహుకు చెప్పారు వర్షాన్ని చూడకముందే, ఆజ్ఞను పాటించే విశ్వాసం నోవహుకు ఉంది.

హెబ్రీయులకు 11:7

తమ ఇంటి నుండి వెళ్లిపోతున్న అబ్రాహాము మరియు శారా.

దేవుడు వారిని మెరుగైన స్థలానికి నడిపిస్తారని వాగ్దానం చేసినందున, తమ ఇంటి నుండి వెళ్లే విశ్వాసం ఉన్న అబ్రాహాం మరియు సారా గురించి పౌలు చెప్పారు. వీరు వయసు ఎక్కువగా ఉండి ఇంకా పిల్లలు లేని పరిస్థితిలో కూడా, దేవుని వాగ్దానంపై విశ్వాసం ఉంచి, చాలా పెద్ద కుటుంబం కలుగును అని నమ్మారు.

హెబ్రీయులకు 11:8–16

మోషే యొక్క తల్లి మరియు సోదరి అతనిని బుట్టలో దాచారు.

పౌలు మోషే తల్లి యోకెబెదు గురించి కూడా చెప్పాడు. మోషే పసివాడిగా ఉన్నప్పుడు అతన్ని దాచిపెట్టి, చెడ్డవాడైన రాజు నుండి అతనిని రక్షించడానికి ఆమెకు విశ్వాసం ఉంది.

హెబ్రీయులు 11:23

ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయునితో చెడుగా ప్రవర్తించడాన్ని మోషే గమనిస్తున్నాడు.

మోషే ఐగుప్తులో పెరిగాడు. అతను ధనవంతుడు మరియు సౌకర్యవంతమైనవాడు కావచ్చు. కానీ దేవునియందు మరియు ఆయన ఆశీర్వాదాలపై నమ్మకం ఉన్నందున అతను అవన్నీ వదులుకున్నాడు.

హెబ్రీయులకు 11:24–27

ఎఱ్ఱ సముద్రమును చీల్చుతున్న మోషే.

తన విశ్వాసం కారణంగా, మోషే దేవుని ప్రజలను బానిసత్వం నుండి బయటకు నడిపించాడు. వారు ఎర్ర సముద్రం గుండా ఎండిన నేలపై నడిచారు కూడా!

హెబ్రీయులు 11:29

తన పిల్లలతో రాహాబు.

పౌలు రాహాబు గురించి కూడా చెప్పాడు. ఆమె పట్టణంలో ఎవరూ ప్రభువును విశ్వసించకపోయినా, దేవుని ప్రజలకు సహాయం చేయగల విశ్వాసం ఆమెకు ఉంది. ఆమె విశ్వాసం ఆమె కుటుంబాన్ని కాపాడింది.

హెబ్రీయులకు 11:30–31

ఆ పురుషుడు మరియు బాలిక వారు మరమ్మతు చేసిన కుండను చూస్తున్నారు.

జీవితం కష్టతరమైనప్పుడు కూడా, విశ్వాసానికి సంబంధించిన ఈ అనేక ఉదాహరణలు యేసు క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండటానికి మనకు సహాయపడతాయని పౌలు చెప్పాడు. మన పాపాలకు పశ్చాత్తాపపడి “మన విశ్వాసమునకు కర్తయు మరియు దానిని కొనసాగించు” యేసు వైపు చూడవచ్చు. ఆయన ప్రాయశ్చిత్తం గొప్ప ఆనందాన్ని మరియు స్వస్థతను తెస్తుందని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనకోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు!

హెబ్రీయులకు 12:1–2