లేఖన కథలు
యేసు తన అపొస్తలులకు యాజకత్వపు తాళపుచెవులను ఇస్తారు—“ఈ బండమీద నా సంఘమును కట్టుదును”


మత్తయి 16–17

యేసు తన అపొస్తలులకు యాజకత్వపు తాళపుచెవులను ఇస్తారు

“ఈ బండమీద నా సంఘమును కట్టుదును”

తన శిష్యులతో మాట్లాడుతున్న యేసు.

ఒక రోజు యేసు తన శిష్యులను, ప్రజలు తనను ఎవరని అనుకుంటున్నారు అని అడిగారు. కొందరు బాప్తిస్మమిచ్చు యోహానని అంటున్నారని, మరికొందరు ఆయన పాత నిబంధన నుండి తిరిగి వచ్చిన ఒక ప్రవక్త అనుకుంటున్నారని, ఆయన శిష్యులు జవాబిచ్చారు.

మత్తయి 16:13–14

యేసుకు జవాబిస్తున్న పేతురు.

అప్పుడు యేసు, తనను ఎవరని అనుకుంటున్నారు అని తన శిష్యులను అడిగారు. పేతురు, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.”

మత్తయి 16:15–16

పేతురుతో మాట్లాడుతున్న యేసు.

పేతురు ఇలా చెప్పడం విన్న యేసు సంతోషించారు. యేసు ఎవరనేది తాను ఇతరుల నుండి నేర్చుకోలేదని ఆయన పేతురుతో చెప్పారు. పరలోక తండ్రి ఆ విషయాన్ని అతనికి వెల్లడించారు.

మత్తయి 16:17

పేతురుకు యాజకత్వపు తాళపుచెవులు ఇస్తానని యేసు వాగ్దానం చేశారు.

యేసు పేతురుతో ఇలా అన్నారు, “ఈ బండమీద నా సంఘమును కట్టుదును.” తరువాత ఆయన పేతురుకు యాజకత్వపు తాళపుచెవులు లేదా దేవుని నుండి అధికారాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు, తద్వారా అతను మరియు ఇతర అపొస్తలులు భూమిపై ఆయన సంఘాన్ని నడిపించగలరు.

మత్తయి 16:18–19

పేతురు, యాకోబు మరియు యోహానులను యేసు ఒక కొండపైకి తీసుకెళ్తారు.

కొన్ని రోజుల తర్వాత, పేతురు, యాకోబు మరియు యోహానులను యేసు ఒక ఎత్తైన కొండపైకి ప్రార్థన చేయడానికి తీసుకెళ్తారు.

మత్తయి 17:1; లూకా 9:28

ప్రార్థన చేస్తున్న యేసు.

యేసు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన వస్త్రములు కూడా ప్రకాశవంతంగా కనిపించాయి.

మత్తయి 17:2; లూకా 9:29

మోషే మరియు ఏలీయా కనిపించారు.

పాత నిబంధన నుండి ఇద్దరు ప్రవక్తలు, మోషే మరియు ఏలీయా కనిపించారు. వారు యేసుతో ఆయన మరణం మరియు పునరుత్థానం గురించి మాట్లాడారు, ఇది త్వరలో యెరూషలేములో జరగనుంది. పేతురు యేసుతో, “ప్రభువా, మన మిక్కడ ఉండుట మంచిది” అని అన్నాడు.

మత్తయి 17:3–4; లూకా 9:30–33

యేసు మరియు ఇతరులు దేవుని స్వరాన్ని విన్నారు.

పేతురు మాట్లాడుతుండగా, ఒక ప్రకాశవంతమైన మేఘం వారిని చుట్టుముట్టింది. “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందిస్తున్నాను; ఈయన మాట వినుడి” అని దేవుని స్వరం చెప్పడం వారు విన్నారు. పేతురు, యాకోబు మరియు యోహాను భయపడి నేలపై పడిపోయారు.

మత్తయి 17:5–6

యేసు పేతురు మరియు యాకోబు, యోహానులతో భయపడవద్దని చెప్పారు.

యేసు తన అపొస్తలులను ముట్టి, “లెండి, భయపడకుము” అని చెప్పారు. వారు కన్నులెత్తి చూశారు. మోషే మరియు ఏలీయా వెళ్ళిపోయారు. ఈ పర్వతం మీద, పేతురు, యాకోబు మరియు యోహాను, యేసు వారికి వాగ్దానం చేసిన యాజకత్వపు తాళపుచెవులను పొందారు.

మత్తయి 17:7-9; సిద్ధాంతము మరియు నిబంధనలు 27:12–13 కూడా చూడండి