లేఖన కథలు
సీమోను మరియు దేవుని యొక్క శక్తి—దేవుని యాజకత్వం గురించి నేర్చుకోవడం.


అపొస్తలుల కార్యములు 8:5–24

సీమోను మరియు దేవుని యొక్క శక్తి

దేవుని యాజకత్వం గురించి నేర్చుకోవడం.

ఒక అపొస్తలుడు ఒక వ్యక్తిని స్వస్థపరచడాన్ని సీమోను చూస్తున్నాడు.

సమరయలో సీమోను అనే వ్యక్తి నివసించేవాడు. అతను యేసు క్రీస్తు యొక్క సువార్తను విన్నప్పుడు, అతను నమ్మాడు. దేవుని యొక్క శక్తితో యేసు శిష్యులు చేసిన అద్భుతాలను చూసి కూడా అతను ఆశ్చర్యపోయాడు. సీమోను బాప్తిస్మము తీసుకున్నాడు, అలాగే సమరయలోని అనేక మంది పురుషులు మరియు స్త్రీలు కూడా బాప్తిస్మము తీసుకున్నారు.

అపొస్తలుల కార్యములు 8:5–13

పేతురు మరియు యోహాను ఒక వ్యక్తి తలపై చేతులు పెట్టారు.

సమరయలోని ప్రజలు బాప్తిస్మము తీసుకుంటున్నారని యెరూషలేములోని అపొస్తలులు విన్నారు. పేతురు మరియు యోహాను సమరయకు వెళ్ళారు. దేవుని శక్తిని, యాజకత్వాన్ని ఉపయోగించి, వారు బాప్తిస్మము పొందిన ప్రజలపై చేతులుంచి, వారికి పరిశుద్ధాత్మ వరమును ఇచ్చారు.

అపొస్తలుల కార్యములు 8:14–17

దేవుని యాజకత్వాన్ని కొనడానికి డబ్బులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్న సీమోను.

పేతురు మరియు యోహాను ఇలా చేయడం సీమోను చూసి, వారియెదుట డబ్బులు పెట్టి, “ఈ అధికారము నాకియ్యుడని” అని అడిగెను. పరిశుద్ధాత్మ వరాన్ని ఇవ్వడానికి అతను దేవుని యాజకత్వాన్ని కూడా కొనాలనుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 8:18–19

సీమోనుకు యాజకత్వం గురించి బోధిస్తున్న పేతు.

దేవుని శక్తిని ఎవరూ కొనలేరని పేతురు వివరించాడు. ఇది ఆయన నుండి వచ్చిన బహుమతి. సీమోను హృదయం మారాలని పేతురు అతనికి చెప్పాడు. పశ్చాత్తాపపడి క్షమాపణ కోసం దేవునికి ప్రార్థించమని ఆయన సీమోను‌ను ఆహ్వానించాడు.

అపొస్తలుల కార్యములు 8:20–23

సీమోను పేతురును క్షమాపణ అడుగుతాడు.

సీమోను పశ్చాత్తాపపడ్డాడు. తాను మారడానికి సహాయం చేయమని, తన కొరకు ప్రార్థించమని అతను పేతురును అడిగాడు.

అపొస్తలుల కార్యములు 8:24