మత్తయి 14:13–21; యోహాను:6
యేసు వేలాది మందికి ఆహారం ఇచ్చారు
ఆయనే జీవాహారము
బాప్తిస్మమిచ్చు యోహాను చంపబడ్డాడని యేసు కనుగొన్నారు. ఆయన ఒంటరిగా కొంత సమయం గడపడానికి పట్టణాలకు దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళారు.
మత్తయి 14:13
యేసు ఎక్కడికి వెళ్ళారో ప్రజలు విని ఆయనను వెంబడించారు. యేసు వారిని చూశారు, మరియు ఆయనకు వారిపై ప్రేమ కలిగింది. ఆయన రోజంతా వారిని ఆశీర్వదిస్తూ, స్వస్థపరుస్తూ గడిపారు.
మత్తయి 14:13–14
దినము ముగిసే సమయానికి, ప్రజలకు ఆకలి వేయడం ప్రారంభమైంది. ఆహారం కోసం పట్టణాలకు తిరిగి వెళ్లమని, యేసు ప్రజలకు చెప్పాలని అపొస్తలులు భావించారు. కానీ యేసు వారు అక్కడే ఉండాలని కోరుకున్నారు. ప్రజలకు తినడానికి ఏదైనా ఇవ్వమని ఆయన అపొస్తలులను అడిగారు.
మత్తయి 14:15–16
అపొస్తలుడైన అంద్రెయ ఒక బాలుడిని కనుగొన్నాడు, అతని వద్ద ప్రజలకు ఇవ్వడానికి ఐదు రొట్టెలు మరియు రెండు చిన్న చేపలు ఉన్నాయి. కానీ తినవలసిన అవసరం ఉన్నవారు 5,000 మంది పురుషులు, అలాగే స్త్రీలు మరియు పిల్లలు ఉన్నారు. ఇంత తక్కువ ఆహారంతో వాళ్ళు ఇంత మందికి ఎలా తినిపించగలిగారు?
మత్తయి 14:17, 21; యోహాను 6:8–10
యేసు తన దగ్గరకు ఆహారాన్ని తీసుకురావాలని అపొస్తలులను అడుగుతారు. ఆయన జనసమూహమును పచ్చిక మీద కూర్చోమని చెప్పారు. తరువాత యేసు రొట్టె మరియు చేపల కోసం పరలోక తండ్రికి కృతజ్ఞతలు చెప్పి దానిని ఆశీర్వదించమని ప్రార్థన చేశారు. తరువాత ఆయన రొట్టెను, చేపలను ముక్కలుగా విరిచారు.
మత్తయి 14:18–19; యోహాను 6:10–11
యేసు తన అపొస్తలులను ప్రజలకు రొట్టెలు, చేపలు ఇవ్వమని అడిగారు. అందరూ కడుపునిండా తిన్నారు. వారు తినిన తర్వాత కూడా మిగిలిపోయిన ఆహారం ఇంకా 12 బుట్టల నిండా ఉంది!
మత్తయి 14:20; యోహాను 6:11–13
మరుసటి రోజు, ప్రజలు తిరిగి వచ్చి మళ్ళీ యేసును కనుగొన్నారు. కానీ యేసు వారికి ఆహారం ఇచ్చినందున వారిలో చాలామంది తనను వెంబడిస్తున్నారని ఆయనకు తెలుసు. ఆహారం కొద్దిసేపు మాత్రమే ఉంటుందని యేసు వారికి గుర్తు చేశారు. వారికి ఇవ్వడానికి అంతకంటే మంచిది ఆయన దగ్గర ఉంది.
యోహాను 6:14, 24–27
“జీవాహారము నేనే,” అని యేసు చెప్పెను. రొట్టె మనకు భూమిపై జీవితాన్ని ఇస్తుంది. కానీ యేసు క్రీస్తు మనకు పరలోక తండ్రితో నిత్యజీవమును ఇవ్వగలరు.
యోహాను 6:35–58
యేసు బోధిస్తున్నది చాలామందికి నచ్చలేదు. వారు వెళ్ళిపోయి ఇక యేసును అనుసరించకూడదని నిర్ణయించుకున్నారు.
యోహాను 6:60, 66
అప్పుడు యేసు తన అపొస్తలులతో, “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” అని అడిగాడు. “ప్రభువా, యొవని యెద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు,” అని పేతురు జవాబిచ్చాడు. అపొస్తలులు వెళ్ళిపోలేదు. యేసు క్రీస్తు రక్షకుడని మరియు దేవుని కుమారుడని వారికి తెలుసు.
యోహాను 6:67–69