యోహాను 1:43–51
వచ్చి చూడండి
యేసును అనుసరించమని ఒక స్నేహితుడిని ఆహ్వానించడం
ఫిలిప్పు అనే వ్యక్తి యేసు శిష్యులలో ఒకడు. యేసు రక్షకుడని అతనికి తెలుసు. తన స్నేహితుడైన నతనయేలు కూడా యేసు గురించి తెలుసుకోవాలని ఫిలిప్పు కోరుకున్నాడు.
యోహాను 1:43–45
దేవుడు ఒక రక్షకుడిని పంపుతారని లేఖనాలు చెబుతున్నాయని నతనయేలుకు తెలుసు. రక్షకుడిని కనుగొన్నానని ఫిలిప్పు అతనికి చెప్పాడు—ఆయన పేరు యేసు, నజరేతు నుండి వచ్చారు.
యోహాను 1:45
మొదట నతనయేలు అతని మాట నమ్మలేదు. రక్షకుడు నజరేతు నుండి రాగలరని అతను అనుకోలేదు. “నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా?” అని అడిగాడు. “వచ్చి చూడుమని” ఫిలిప్పు అతనితో అనెను.
యోహాను 1:46
నతనయేలు ఫిలిప్పుతో కలిసి యేసును కలవడానికి వెళ్ళాడు. వారు రావడం చూసి యేసు, నతనయేలు మంచివాడు, నిజాయితీపరుడు అని అన్నారు. నతనయేలు ఆశ్చర్యపోయాడు. అతను అంతకు ముందు ఎప్పుడూ యేసును కలవలేదు. యేసు అతన్ని ఎలా తెలుసుకున్నారు?
యోహాను 1:47–48
ఫిలిప్పు తనతో మాట్లాడే ముందు, తాను అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉండటం చూశానని యేసు నతనయేలుతో చెప్పారు.
యోహాను 1:48
యేసు దేవుని కుమారుడని ఇప్పుడు నతనయేలుకు తెలుసు. యేసు నతనయేలుతో గొప్ప విషయాలను చూస్తాడని చెప్పారు—ఉదాహరణకు, దేవదూతలు పరలోకం నుండి బయటకు వస్తున్నట్లు చూస్తాడని—అన్నీ అతని విశ్వాసము వలననే జరుగుతాయి.
యోహాను 1:49–51