మార్కు 10:13–16
యేసు చిన్నపిల్లలను ఆశీర్వదిస్తారు
“దేవుని రాజ్యము ఈలాటివారిదే”
యేసు బోధిస్తుండగా, కొంతమంది తమ చిన్నపిల్లలను ఆయన వద్దకు తీసుకువచ్చారు. తమ పిల్లలను యేసు ఆశీర్వదించాలని వారు కోరుకున్నారు. ఆయన శిష్యులు వారిని ఆపడానికి ప్రయత్నించారు.
మత్తయి 19:13; మార్కు 10:13
పిల్లలను తన వద్దకు రానివ్వమని యేసు తన శిష్యులకు చెప్పారు. చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి చెందినవారని ఆయన చెప్పారు. ఒకవేళ ఎవరైనా దేవునితో మళ్ళీ జీవించాలనుకుంటే, వారు ఒక చిన్న పిల్లవాడిలా మారాలని ఆయన వివరించారు.
మత్తయి 19:14; మార్కు 10:14–15
అప్పుడు యేసు ఆ చిన్నపిల్లలను తన చేతులలోకి తీసుకుని వారిని ఆశీర్వదించారు.
మత్తయి 19:15; మార్కు 10:16