మత్తయి 3
యేసు బాప్తిస్మము తీసుకున్నారు
దేవునికి విధేయత చూపించడంలో ఉదాహరణగా ఉన్నారు
యేసు క్రీస్తు రాకడకు ప్రజలు సిద్ధపడటానికి సహాయం చేయడానికి దేవుడు యోహానును పిలిచారు. పశ్చాత్తాపపడి బాప్తిస్మము తీసుకోవాలని యోహాను ప్రజలకు బోధించాడు. ప్రజలు అతనిని బాప్తిస్మమిచ్చు యోహాను అని పిలిచేవారు.
మత్తయి 3:1–12
యోహాను ఒక శక్తివంతమైన బోధకుడు. ఆయన మాట వినడానికి మరియు బాప్తిస్మము తీసుకోవడానికి చాలా మంది వచ్చారు. ఒకరోజు, యేసు బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చారు.
మత్తయి 3:5, 13
యేసు ఎల్లప్పుడూ దేవునికి విధేయుడని యోహానుకు తెలుసు. ఆయన పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. యేసుకు బాప్తిస్మము ఇవ్వాల్సిన అవసరం ఉందని యోహాను అనుకోలేదు. యేసే తనకు బాప్తిస్మము ఇవ్వాలని యోహాను అనుకున్నాడు!
మత్తయి 3:14
తాను కూడా బాప్తిస్మము తీసుకోవాలని యేసు చెప్పారు. ఆయన తన తండ్రి ఆజ్ఞలన్నిటినీ పాటించాలని కోరుకున్నారు. ఆయన మనకు ఒక ఉదాహరణగా ఉండాలనుకున్నారు. యోహాను ఆయనకు బాప్తిస్మము ఇచ్చాడు.
మత్తయి 3:13–15; 2 నీఫై 31:5–7
యేసు నీళ్లలో నుండి బయటకు వచ్చిన తరువాత, పరిశుద్ధాత్మ పావురంలా ఆయనపైకి దిగి వచ్చింది. పరలోక తండ్రి ఆకాశము నుండి మాట్లాడుతూ, “ఈయన నా ప్రియ కుమారుడు” అని అన్నారు. యేసు యందు పరలోక తండ్రి చాలా ఆనందంగా ఉన్నారు.
మత్తయి 3:16–17