మత్తయి 21:1–16
యేసు యెరూషలేములో ప్రవేశించారు
ప్రజలు తమ రక్షకుడిని స్వాగతించారు
యూదులకు ముఖ్యమైన పండుగ అయిన పస్కా పండుగ సమయం సమీపిస్తోంది. పస్కా పండుగ కోసం చాలా మంది యెరూషలేముకు వెళ్లారు. యేసు మరియు ఆయన శిష్యులు కూడా వెళ్లారు. యేసు వస్తున్నాడని ప్రజలు విన్నప్పుడు, వారు ఆయనను కలవడానికి వెళ్లారు.
మత్తయి 21:1; యోహాను 12:12–13
యేసు మరియు ఆయన శిష్యులు యెరూషలేమునకు సమీపించినప్పుడు, ఒక గాడిదను తన వద్దకు తీసుకురమ్మని ఆయన వారిని కోరారు. చాలా సంవత్సరాల క్రితం, ఒక ప్రవక్త రక్షకుడు ఒక చిన్న గాడిదపై స్వారీ చేస్తూ వినయపూర్వకంగా వస్తాడని చెప్పాడు.
యెషయా 21:1–7; జెకర్యా 9:9 కూడా చూడండి.
యేసు గాడిదను ఎక్కి నగరంలో ప్రవేశించారు. ఆయనను చూచి ప్రజలు చాలా సంతోషించారు. వారు ఆయనకు రాజులా స్వాగతం పలికారు. గాడిద నడవడానికి వీలుగా వారు నేలపై మట్టలను మరియు బట్టలను పరిచారు. వారు “జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక” అని దేవునికి కృతజ్ఞతలు చెప్పి, కేకలువేసిరి.
మత్తయి 21:8–9; లూకా 19:36–38; యోహాను 12:13
యెరూషలేములోని చాలా మంది ప్రజలు ఏమి జరుగుతుందోనని ఆశ్చర్యపోయారు. “ఈయన ఎవరు?” అని వారు అడిగారు. నజరేయుడైన యేసు అని మరికొందరు జవాబిచ్చారు.
మత్తయి 21:10–11
తరువాత, యేసు దేవాలయానికి వెళ్ళారు. అక్కడ కొందరు డబ్బు ఇచ్చిపుచ్చుకుంటూ, బలి ఇవ్వడానికి జంతువులను అమ్ముతున్నారు. వారు నిజాయితీగా ప్రవర్తించడం లేదని యేసుకు తెలుసు.
మత్తయి 21:12
దేవాలయంలో ఆరాధన చేయాలనుకునే ప్రజల నుండి వారు డబ్బు సంపాదించడాన్ని యేసు ఇష్టపడలేదు. ఆయన వారిని దేవాలయం నుండి బయటకు పంపించి, వారి బల్లలను పడగొట్టారు. “నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారు,” అని ఆయన అన్నారు.
మత్తయి 21:12–13; యెషయా 56:7; యిర్మీయా 7:11 కూడా చూడండి.
గుడ్డివారు లేదా నడవలేనివారు దేవాలయంలో యేసు వద్దకు వచ్చారు మరియు ఆయన వారిని స్వస్థపరిచారు. పిల్లలు యేసును స్తుతిస్తూ, ఆయన రక్షకుడని చెబుతూ “హోసన్నా,” అని కేకలు వేశారు.
మత్తయి 21:14–15
యేసు చేసిన పనిని చూసి, పిల్లలు చెబుతున్న మాటలను విని, కొంతమంది యాజకులు మరియు శాస్త్రులు కలత చెందారు. దేవుడు పిల్లల నోటి నుండి పరిపూర్ణమైన స్తోత్రాన్ని పుట్టిస్తాడని చెప్పే ఒక లేఖన వచనాన్ని యేసు వారికి గుర్తుచేశారు.
మత్తయి 21:15–16; కీర్తనలు 8:2 కూడ చూడుము.