లేఖన కథలు
యేసు లాజరును తిరిగి బ్రతికించారు—“పునరుత్థానమును జీవమును నేనే”


యోహాను 11:1–46

యేసు లాజరును తిరిగి బ్రతికించారు

“పునరుత్థానమును జీవమును నేనే”

మరియ, మార్త మరియు లాజరు.

మరియ, మార్త మరియు లాజరు బేతనియ అనే గ్రామంలో నివసించేవారు. వారు యేసును విశ్వసించారు మరియు ఆయన వారిని ప్రేమించారు. మరియ మరియు మార్త లాజరు యొక్క సహోదరీలు.

యోహాను 11:1, 5

లాజరు జబ్బుపడ్డాడు.

లాజరు చాలా జబ్బుపడ్డాడు. యేసు మరొక పట్టణంలో ఉన్నారు. మరియ మరియు మార్త ఆయన స్నేహితుడు అనారోగ్యంగా ఉన్నాడని తెలియజేయడానికి ఆయనకు ఒక సందేశాన్ని పంపారు.

యోహాను 11:1–3

యేసు తాను లాజరును తిరిగి బ్రతికిస్తానని చెప్పారు.

యేసు రెండు రోజుల పాటు వేచి ఉన్నారు. తరువాత ఆయన తన శిష్యులతో వారు బేతనియకి వెళతామని చెప్పారు. బేతనియ సమీపంలోని కొందరు ప్రజలు యేసుకు హాని తలపెట్టాలని కోరుకుంటున్నందున శిష్యులు ఆందోళన చెందారు. అయితే యేసు లాజరుకు సహాయం చేయాలనుకున్నారు. లాజరు అప్పటికే చనిపోయాడని, తాను అతన్ని తిరిగి బ్రతికిస్తానని యేసు చెప్పారు.

యోహాను 11:6–16

మార్త యేసును కలుసుకుంది.

మార్త పట్టణం వెలుపల యేసును కలుసుకుంది. యేసు ముందుగానే వచ్చి ఉంటే, లాజరు చనిపోయి ఉండేవాడు కాదని ఆమె అన్నది. లాజరు మళ్ళీ బ్రతుకుతాడని యేసు వాగ్దానం చేశారు.

యోహాను 11:17–24

మార్త యేసుతో మాట్లాడుతుంది.

“పునరుత్థానమును జీవమును నేనే,” అని యేసు చెప్పెను. ఆయన మార్తను, ఆమె తనను నమ్ముతుందో లేదో అని అడిగారు. “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను.” అని ఆమె అన్నది.

యోహాను 11:25–27

మార్త, మరియ మరియు యేసు

మార్త ఇంటికి తిరిగి వెళ్లి యేసు వచ్చారని మరియతో చెప్పింది. మరియ వచ్చి, తన సహోదరుని గురించి ఏడుస్తూ యేసు పాదాల వద్ద పడిపోయింది. యేసు కూడా కన్నీళ్లు విడిచెను. ఆయన లాజరును, మరియను మరియు మార్తను ప్రేమించారు.

యోహాను 11:28–36

యేసు లాజరును ఖననం చేసిన గుహ వద్దకు వెళ్తారు.

యేసు, మార్త, మరియ మరియు ఇతరులు లాజరును ఖననం చేసిన గుహ వద్దకు వెళ్తారు. ఒక పెద్ద రాయి ఆ ద్వారాన్ని కప్పివేసింది. రాయిని పక్కకు తొలగించమని యేసు చెప్పారు.

యోహాను 11:38–39

తనను నమ్మమని యేసు మార్తను అడుగుతారు.

అయితే మార్త యేసుతో లాజరు చనిపోయి అప్పటికే నాలుగు దినములైనది అని చెప్పింది. యేసు మార్తకు తన వాగ్దానాన్ని గుర్తు చేశారు. ఆయన ఆమెను నమ్మమని కోరారు.

యోహాను 11:39–40

యేసు లాజరును బయటకు రమ్మని చెప్పారు.

అప్పుడు యేసు తన తండ్రికి ప్రార్థించారు. ఎల్లప్పుడూ తన మాట వింటున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడు తనను రక్షకునిగా పంపించారని ప్రజలు నమ్మాలని యేసు కోరుకుంటున్నారు. అప్పుడు యేసు, “లాజరూ, బయటికి రమ్మని” బిగ్గరగా చెప్పెను.

యోహాను 11:41–43

లాజరు సమాధి నుండి బయటకు నడిచి వచ్చాడు.

లాజరు సమాధి నుండి బయటకు నడిచి వచ్చాడు. అతను పూడ్చిపెట్టినప్పుడు కప్పిన బట్టలు మరియు పరుపులోనే ఇంకా చుట్టబడి ఉన్నాడు. అతనికి చుట్టబడిన బట్టలు విప్పమని యేసు ప్రజలకు చెప్పారు. ఆ రోజు చూస్తున్న చాలా మంది ప్రజలు యేసు నిజంగా రక్షకుడని, దేవుని కుమారుడని అప్పుడు నమ్మారు.

యోహాను 11:44–45