లేఖన కథలు
యేసు మరియు యువ ధనవంతుడు—“నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?”


మార్కు 10:17–31

యేసు మరియు యువ ధనవంతుడు

“నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?”

యేసు వద్దకు పరిగెత్తుకుంటూ వస్తున్న యువకుడు.

యేసు మరియు ఆయన శిష్యులు ప్రయాణిస్తుండగా, ఒక ధనవంతుడైన యువకుడు యేసు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లాడు. పరలోక తండ్రితో మళ్ళీ జీవించాలంటే తాను ఏమి చేయాలని అతను యేసును అడిగాడు.

మార్కు 10:17

యేసు ఆ యువకుడికి ఆజ్ఞలను గుర్తు చేస్తున్నారు.

ఇదివరకే దేవుని ఆజ్ఞలు అతనికి తెలుసలుని రక్షకుడు ఆ యువకుడికి గుర్తుచేశారు: నరహత్య చేయవద్దు, అబద్ధసాక్ష్యము పలుకవద్దు లేదా దొంగిలవద్దు మరియు నీ తలిదండ్రులను సన్మానింపుము.

మార్కు 10:19

ఆ యువకుడు యేసుకు ప్రతిస్పందిస్తాడు.

ఆ యువకుడు తాను బాల్యమునుండి ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ పాటిస్తున్నానని జవాబిచ్చాడు.

మార్కు 10:20

యేసు ఆ యువకుడికి బోధిస్తున్నారు.

యేసు ఆ యువకుడిని ప్రేమగా చూశారు. ఇంకా ఒక పని చేయవలసి ఉందని ఆయన అతనికి చెప్పారు. అతను తన దగ్గర ఉన్నదంతా అమ్మేసి, ఆ డబ్బును పేదలకు ఇచ్చి, యేసు అనుచరులలో ఒకడు కావాలి. అప్పుడు అతనికి పరలోకంలో ధనము ఉంటుంది!

మార్కు 10:21

ఆ యువకుడు వెళ్ళిపోతాడు.

ఆ యువకుడు చాలా ధనవంతుడు. తనకున్నదంతా ఇచ్చేయాలని అతను అనుకోలేదు. అతను బాధగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

మార్కు 10:22

మనము సంపదపై కాదు, దేవునిపై విశ్వాసం ఉంచాలని యేసు బోధిస్తున్నారు.

ధనవంతులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలోకి వెళ్ళడం సులభమని యేసు చెప్పారు. శిష్యులు ఆశ్చర్యపోయారు. "అలాగైతే ఎవరు రక్షింపబడగలరు?" అని వారు అడిగారు. మనం రక్షణ పొందాలంటే దేవునిపై విశ్వాసం ఉంచాలని యేసు వివరించారు. "దేవునికి సమస్తమును సాధ్యమే" అని ఆయన అన్నారు.

మార్కు 10:23–30