లేఖన కథలు
పదిమంది కన్యల ఉపమానం—యేసు రాకడ కొరకు సిద్ధంగా ఉండటం


మత్తయి 25:1–13

పదిమంది కన్యల ఉపమానం

యేసు తిరిగి రావడానికి సిద్ధంగా ఉండటం

యేసు శిష్యులు ఆయన ఎప్పుడు తిరిగి వస్తారని ఆయనను అడిగారు.

యేసు తన తండ్రి వద్దకు తిరిగి వెళ్లిన తరువాత, ఏదో ఒక రోజు యేసు మరలా భూమికి వస్తారని ఆయన శిష్యులకు తెలుసు. ఆయన ఎప్పుడు తిరిగి వస్తారనేది తమకు ఎలా తెలుస్తుందని వారు ఆయనను అడిగారు. వారు ఆయన కొరకు సిద్ధంగా ఉండాలని కోరుకున్నారు. వారికి సమాధానం చెప్పడానికి, యేసు ఒక ఉపమానం చెప్పారు.

మత్తయి 24:3 చూడండి.

పది మంది స్త్రీలు ఒక వివాహానికి వెళ్తున్నారు.

ఆ ఉపమానంలో, పది మంది స్త్రీలు ఒక వివాహానికి వెళ్తున్నారు. వివాహం రాత్రిపూట జరిగింది, కాబట్టి స్త్రీలు తమ దారిని వెలిగించుకోవడానికి నూనెతో నింపిన దీపాలను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ స్త్రీలలో ఐదుగురు తెలివైనవారు, వారు పుష్కలంగా నూనె తెచ్చారు. మిగతా ఐదుగురు తెలివితక్కువవారు మరియు తగినంత నూనె తీసుకురాలేదు.

మత్తయి 25:1–4

వరుడి కోసం ఎదురు చూస్తూ స్త్రీలు నిద్రపోతారు.

వరుడు మరియు అతని వివాహ బృందం వచ్చే వరకు స్త్రీలు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ వరుడు చాలా సమయం తీసుకున్నాడు. వాళ్ళు వేచి ఉండగా, అందరూ నిద్రపోయారు.

మత్తయి 25:5

ఎవరో అంటున్నారు చివరికి వరుడు వస్తున్నాడని.

అర్ధరాత్రి ఎవరో అరిచారు, చివరికి వరుడు వస్తున్నాడని! అతనితో పాటు పెళ్లి విందుకు స్త్రీలు కూడా వచ్చే సమయం ఆసన్నమైంది.

మత్తయి 25:6

ఐదుగురు స్త్రీలు తమ దీపాలను వెలిగించగలిగారు. మరో ఐదుగురు స్త్రీల దగ్గర నూనె లేదు.

ఆ స్త్రీలందరూ తమ దారిని వెలిగించుకోవడానికి తమ దీపాలను పట్టుకున్నారు. కానీ తగినంత నూనె తీసుకురాని ఐదుగురు స్త్రీల దగ్గర వెలుతురు లేదు. వారు వరుడి కోసం ఎదురు చూస్తుండగా వారి నూనె అయిపోయింది.

మత్తయి 25:7--8

నూనె లేని మహిళలు మరింత నూనె కొనడానికి వెళ్లారు.

నూనె లేని ఆ ఐదుగురు స్త్రీలు, వారి దగ్గర ఉన్న నూనెను కొంచెం పంచాలని ఇతరులను అడిగారు. కానీ పంచుకోవడానికి తగినంత నూనె లేదు. నూనె లేని ఐదుగురు స్త్రీలు మరింత నూనె కొనడానికి త్వరగా వెళ్లారు.

మత్తయి 25:8–9

వరుడు వచ్చి సిద్ధంగా ఉన్న ఐదుగురు స్త్రీలతో మాట్లాడుతాడు.

వారు వెళ్ళిపోయాక, వరుడు వచ్చాడు! సిద్ధంగా ఉన్న ఐదుగురు స్త్రీలు అతనితో పాటు పెళ్లికి వెళ్ళారు.

మత్తయి 25:10

నూనె కొనడానికి వెళ్లిన స్త్రీలు పెళ్లిలోకి ప్రవేశించలేకపోయారు.

ఇతర స్త్రీలు తిరిగి వచ్చేసరికి, తలుపు మూసి ఉంది. వాళ్ళు తలుపు తట్టి, వరుడిని లోపలికి రానివ్వమని అడిగారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ళు పెళ్లిలోకి రాలేకపోయారు.

మత్తయి 25:11–12

తాను తిరిగి వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలని యేసు తన అనుచరులకు బోధిస్తారు.

యేసు ఉపమానంలోని వరుడిలా ఉన్నారు. ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తారనేది ఎవరికీ తెలియదు. అది పరలోక తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి యేసు తన శిష్యులతో తగినంత నూనె ఉన్న ఐదుగురు స్త్రీల వలె సిద్ధంగా ఉండమని చెప్పారు. ప్రభువు ఆజ్ఞలను పాటించి, ఆత్మను అనుసరించే వ్యక్తులు యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటారు.

మత్తయి 24:36; 25:13; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:56–57