మత్తయి 27; లూకా 23; యోహాను 19
యేసు మనకొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు
మనలను పాపం మరియు మరణం నుండి రక్షించేందుకు చేసిన త్యాగం.
పిలాతు యేసును సిలువ వేయాలని నిర్ణయించిన తర్వాత, ఆయనను తీసుకుపోవాలని తన సైనికులకు ఆజ్ఞాపించాడు. వారు ఆయనను కొరడాలతో కొట్టారు, ఆయనపై ఉమ్మివేశారు, ఆయన తలపై ముళ్ల కిరీటం పెట్టారు, మరియు ఆయనను ఎగతాళి చేశారు.
మార్కు 15:15–20
సైనికులు యేసుతో ఒక భారమైన చెక్క సిలువను మోయించారు. వారు ఆయనను యెరూషలేము వెలుపల ఉన్న గొల్గొతా అనే ప్రదేశానికి తీసుకెళ్లారు.
యోహాను 19:17
సైనికులు యేసు చేతులను, కాళ్ళను సిలువకు మేకులతో కొట్టారు. యేసు తన పరలోకపు తండ్రిని సైనికులను క్షమించమని అడిగారు, ఎందుకంటే వారు దేవుని కుమారుడిని సిలువ వేస్తున్నారని వారికి తెలియదు.
లూకా 23:33–34; ఫుట్‌నోట్ 34cలో జోసెఫ్ స్మిత్ అనువాదం కూడా చూడండి
ఆ రోజు యేసుతో పాటు ఇద్దరు నేరస్థులు సిలువ వేయబడ్డారు. వారిలో ఒకడు ఆయనతో, “నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుము” అని చెప్పెను.
లూకా 23:39
మరో నేరస్థుడు వారు పొందుతున్న శిక్షకు తాము అర్హులమని, కానీ యేసు ఏ తప్పూ చేయలేదని అన్నాడు. ఆయన రాజ్యంలో తనను జ్ఞాపకం ఉంచమని అతను యేసును కోరాడు. త్వరలోనే వారు ఆత్మ లోకంలో కలిసి ఉంటారని యేసు అతనికి చెప్పారు.
లూకా 23:40–43
యేసు క్రీస్తును అనుసరించిన చాలా మంది స్త్రీలు ఆయనతో ఉండటానికి సిలువ వద్దకు వచ్చారు. ఆ స్త్రీలలో ఒకరు యేసు తల్లి మరియ. యేసు ఆమెను చూసి, తన అపొస్తలులలో ఒకరైన యోహానుతో ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు.
యోహాను 19:25–27; లూకా 8: 1–3; మార్కు 15:40–41 కూడా చూడండి.
మూడు గంటలపాటు, భూమి అంతా చీకటి కమ్ముకుంది. యేసు చాలా ఒంటరిగా భావించారు. తన పరలోక తండ్రి తనను విడిచిపెట్టినట్లు ఆయన భావించారు.
మత్తయి 27:45–46
చివరికి, యేసు తన శ్రమను పూర్తి చేశారని తెలుసుకున్నారు. ఆయన, “తండ్రీ, సమాప్తమైనది, నీ చిత్తము నెరవేరినది” అని అన్నారు. అప్పుడు యేసు తల వంచి తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన నిజంగా చనిపోయాడో లేదో చూడటానికి, ఒక సైనికుడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు.
జోసెఫ్ స్మిత్ అనువాదము, మత్తయి 27:54 (మత్తయి 27:50లో, పాదవివరణ ఎ); యోహాను 19:28–30, 34 చూడండి.
యేసు చనిపోయినప్పుడు, భూమి కంపించింది. బండలు ముక్కలుగా పగిలిపోయాయి. దేవాలయంలో అత్యంత పరిశుద్ధ స్థలాన్ని కప్పి ఉంచిన తెర రెండు భాగాలుగా చీలిపోయింది.
మత్తయి 27:51
యేసును గమనిస్తూ ఉన్న సైనికులు భయపడ్డారు. “నిజముగా ఈయన దేవుని కుమారుడని,” వారు అన్నారు.
మత్తయి 27:54
యేసు శిష్యులు ఆయన మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి తోటలో ఉన్న సమాధిలో ఉంచారు. తరువాత వారు సమాధి తలుపు ముందు ఒక పెద్ద రాయిని పెట్టారు.
మత్తయి 27:57–61; యోహాను 19:38–41