మత్తయి 12:1–12; లూకా 13:10–17
విశ్రాంతిదినమున యేసు ఒక స్త్రీని స్వస్థపరుస్తారు
తన పవిత్ర దినమున మంచి చేస్తున్నారు
విశ్రాంతిదినమున గోధుమ పంట చేనులో నడుచుచున్న యేసు మరియు ఆయన శిష్యులు. వారు ఆకలిగా ఉన్నారు, కాబట్టి వారు గోధుమలు కోసి తిన్నారు. పరిసయ్యులు అని పిలువబడే కొంతమంది యూదా నాయకులు వారిని చూశారు. పరిసయ్యులు విశ్రాంతిదినము గురించి చాలా నియమాలు చేశారు. గోధుమలు కోయడం వారి నియమాలకు విరుద్ధం.
మత్తయి 12:1–2
శిష్యులు విశ్రాంతిదినమును ఎందుకు గౌరవించరని పరిసయ్యులు యేసును అడిగారు. వారు ఏ తప్పు చేయలేదని యేసు జవాబిచ్చారు. దేవుడు మనకు విశ్రాంతిదినమును మనలను ఆశీర్వదించడానికి ఇచ్చారు, మన జీవితాలను కష్టతరం చేయడానికి కాదు,
మత్తయి 12:2–8; మార్కు 2:27
తరువాత, యేసు విశ్రాంతిదినమున ఒక సమాజమందిరములో బోధించుచున్నారు. యేసు అక్కడ ఒక స్త్రీని గమనించారు. ఆమె నిటారుగా నిలబడలేకపోయింది. 18 సంవత్సరాలుగా ఆమెకు ఈ సమస్య ఉంది.
లూకా 13:10–12
యేసు ఆ స్త్రీని తన దగ్గరకు రమ్మని అడిగారు. ఆమెను ఆశీర్వదించడానికి ఆయన ఆమెపై తన చేతులు ఉంచారు.
లూకా 13:12–13
వెంటనే, ఆ స్త్రీ నిటారుగా నిలబడింది. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరుస్తున్నందుకు సమాజమందిర అధికారికి కోపం వచ్చింది.
లూకా 13:13–14
ఆ స్త్రీకి సహాయం చేయడం సరైన పని అని యేసు అన్నారు. విశ్రాంతి దినమున మేలుచేయుట సరైనదే. ఆ అధికారి సిగ్గుపడ్డాడు, ఆ స్త్రీ స్వస్థత పొందినందుకు సమాజమందిరంలోని ప్రజలు సంతోషించారు.
లూకా 13:15–17; లూకా 6:9 కూడ చూడుము.