లేఖన కథలు
పాపం చేసిన ఒక స్త్రీని ప్రజలు శిక్షించాలనుకుంటున్నారు—“నీవు వెళ్లి ఇక పాపము చేయకుము”


యోహాను 8:1–11

పాపం చేసిన ఒక స్త్రీని ప్రజలు శిక్షించాలనుకుంటున్నారు

“నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము”

దేవాలయములో బోధిస్తున్న యేసు.

ఒకరోజు తెల్లవారుజామున యేసు క్రీస్తు యెరూషలేములోని దేవాలయానికి వెళ్ళారు. ఆయన బోధన వినడానికి చాలా మంది ఆయన చుట్టూ గుమిగూడారు.

యోహాను 8:1–2

యూదయ నాయకులు ఒక స్త్రీని యేసు వద్దకు తీసుకువచ్చారు.

యేసు బోధిస్తున్నప్పుడు, కొంతమంది యూదయ నాయకులు ఒక స్త్రీని యేసు వద్దకు తీసుకువచ్చారు. ఆమె దేవుని ఆజ్ఞలలో ఒకదానిని ఉల్లంఘిస్తూ పట్టుబడింది. ధర్మశాస్త్రం ప్రకారం, ఆ మహిళను ప్రజలు రాళ్లతో కొట్టి చంపాలి.

యోహాను 8:3–5

ఆ స్త్రీని ఎలా శిక్షించాలి అని యేసును అడుగుతారు.

ఆ మనుష్యులు ఆమెను ఏమి చేయాలి అని యేసును అడుగుతారు. వారు యేసును శోధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆ స్త్రీకి హాని జరగాలని కోరుకోరు అని వారికి తెలుసు. అయితే, ఆ స్త్రీని శిక్షించకూడదని యేసు చెప్పి ఉంటే, అప్పుడు ఆయన ధర్మశాస్త్రం పాటించడం లేదని వారు అనగలిగేవాళ్లు.

యోహాను 8:6

యేసు నేలపై వ్రాస్తున్నారు.

అయితే యేసు వారికి ఏ జవాబూ ఇవ్వలేదు. ఆయన వంగి నేలమీద వ్రాస్తున్నారు. ఆ మనుష్యులు తాము ఏమి చేయాలి అని ఆయనను మళ్ళీ అడిగారు.

యోహాను 8:6–7

యేసు నాయకులకు జవాబిచ్చారు.

చివరికి, యేసు నిలబడి చుట్టూ ఉన్న మనుష్యుల వైపు చూశారు. వారిలో ఎవరైనా పాపము లేనివాడు ఉంటే, అతడు ఆమెపై మొదటి రాయి విసరవచ్చని ఆయన అన్నారు.

యోహాను 8:7

యేసు నేలమీద వ్రాయడం కొనసాగించారు.

అప్పుడు యేసు మళ్ళీ వంగి నేలమీద వ్రాయడం కొనసాగించారు. వారు కూడా పాపాలు కలిగియున్నార ని ఆ పురుషులందరికీ తెలుసు. ఒక్కొక్కరుగా వారు అక్కడి నుండి వెళ్లిపోయారు.

యోహాను 8:8–9

యేసు ఆ స్త్రీతో ఆమె పాపాలు క్షమించబడ్డాయని చెప్పారు.

యేసు చుట్టూ చూసినప్పుడు, అక్కడ ఆ స్త్రీ మాత్రమే నిలబడి ఉండటం చూశారు. ఆమెను శిక్షించాలనుకున్న వారందరూ ఎక్కడికి వెళ్లారని ఆయన ఆమెను అడిగారు. వారందరూ వెళ్లిపోయారని ఆమె ఆయనతో చెప్పింది. యేసు ఆ స్త్రీతో,“నీవు వెళ్లి ఇక పాపము చేయకుము,” అని చెప్పారు. ఆ సమయం నుండి ఆ స్త్రీ యేసును విశ్వసించింది.

యోహాను 8:9–11; జోసెఫ్ స్మిత్ అనువాదము, యోహాను 8:11; యోహాను 8:11లో, పాదవివరణ .