లేఖన కథలు
నడవలేని వ్యక్తిని యేసు స్వస్థపరచడం—శారీరక మరియు ఆధ్యాత్మిక స్వస్థత


మార్కు 2:1–12

నడవలేని వ్యక్తిని యేసు స్వస్థపరచడం

శారీరక మరియు ఆధ్యాత్మిక స్వస్థత

జనసమూహముతో నిండిన ఇంట్లో బోధిస్తున్న యేసు.

యేసు బోధించడం వినాలని చాలా మంది కోరుకున్నారు. ఒకరోజు ఆయన జనసమూహముతో నిండిన ఇంట్లో బోధిస్తున్నారు.

మార్కు 2:1–2

యేసు చేత స్వస్థపరచబడటానికి ఒక వ్యక్తిని మోసుకెళ్తున్న ప్రజలు.

నడవలేని స్నేహితుడితో నలుగురు వ్యక్తులు ఆ ఇంటికి వచ్చారు. వారు అతనిని మంచం మీద మోసుకెళ్ళాల్సి వచ్చింది. వారు తమ స్నేహితుడిని యేసు దగ్గరకు తీసుకురావాలనుకున్నారు, కానీ ఇల్లు చాలా రద్దీగా ఉంది, వారు లోపలికి వెళ్ళలేకపోయారు.

మార్కు 2:3–4

మనిషిని ఇంట్లోకి దించుతున్న వ్యక్తులు.

కాబట్టి వారు తమ స్నేహితుడిని ఇంటి పైకప్పు మీదకు మోసుకెళ్లారు. వారు పైకప్పులో కొంత భాగాన్ని తొలగించి, తమ స్నేహితుడిని మరియు అతని మంచాన్ని ఇంటిలోకి, జనసమూహం మధ్యలో, యేసు యెదుట దించారు.

మార్కు 2:4.

మనుష్యుని క్షమిస్తున్న యేసు.

యేసు వారి విశ్వాసము చూచి, “కుమారుడా నీ పాపములు క్షమింపబడియున్నవి”, అని నడవలేని వ్యక్తితో చెప్పెను.

మార్కు 2:5

కొంతమంది యూదా నాయకులు కలత చెందారు.

ఇది విన్నప్పుడు, కొంతమంది యూదా నాయకులు కలత చెందారు. దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలరని వారు భావించారు.

మార్కు 2:6–7

ఆ మనిషి స్వస్థత పొంది లేచి నిలబడ్డాడు.

వారు ఏమి ఆలోచిస్తున్నారో యేసుకు తెలుసు. తనకు పాపాలను క్షమించే శక్తి ఉందని వారు అర్థం చేసుకోవడానికి, ఆయన ఒక అద్భుతం చేశారు. ఆయన నడవలేని వ్యక్తితో, “నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్ము” అని అన్నారు. ఆ మనిషి లేచి నడిచాడు! అందరూ ఆశ్చర్యపోయి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు.

మార్కు 2:8–12