లేఖన కథలు
కొర్నేలీ మరియు అతని స్నేహితులు పరిశుద్ధాత్మను పొందారు—సువార్త అందరికీ ఉంది


అపొస్తలుల కార్యములు 10

కొర్నేలీ మరియు అతని స్నేహితులు పరిశుద్ధాత్మను పొందారు

సువార్త అందరికీ ఉంది

కొర్నేలీ మరియు అతని కుటుంబం అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు.

కొర్నేలీ ఒక రోమా సైనికుల నాయకుడు. అతను మరియు అతని కుటుంబం దేవుణ్ణి విశ్వసించారు, అయితే వారు యూదులు కాదు మరియు వారికి యేసు క్రీస్తు గురించి తెలియదు. కొర్నేలీ తన దగ్గర ఉన్నదాన్ని పేదలతో పంచుకున్నాడు మరియు తరచుగా దేవునికి ప్రార్థించేవాడు.

అపొస్తలుల కార్యములు 10:1–2

కొర్నేలీకి ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు.

ఒక మధ్యాహ్నం, కొర్నేలీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత అతని వద్దకు వచ్చాడు. ఆ దేవదూత, “కొర్నేలీ, నీ ప్రార్థన వినబడినది” అని అన్నాడు. దేవుడు అతని దయను చూశారు. యొప్పే అనే పట్టణంలో ఉంటున్న అపొస్తలుడైన పేతురును కనుగొనమని దేవదూత కొర్నేలీ‌తో చెప్పాడు. పేతురు కొర్నేలీకు ఏమి చేయాలో చెప్తాడు.

అపొస్తలుల కార్యములు 10:3–6, 30–32

పేతురును వెతకమని కొర్నేలీ తన సేవకులకు చెప్పాడు.

దూత చెప్పిన మాటలను కొర్నేలీ తన సేవకులకు వివరించాడు. అతను యొప్పేకు వారిని పంపి, పేతురును తనను కలవడానికి రావాలని అడిగాడు.

అపొస్తలుల కార్యములు 10:7–8

పేతురు మోకరించి ప్రార్థిస్తున్నాడు.

యొప్పేలో, పేతురు ఒక ఇంటి పైకప్పు మీద ప్రార్థిస్తున్నాడు. అతను ఆకలితో ఉండి భోజనం చేయడానికి సిద్ధమవుతుండగా, అకస్మాత్తుగా ఒక దర్శనం చూశాడు.

అపొస్తలుల కార్యములు 10:9–10

పేతురు ఒక దర్శనము చూశాడు.

పేతురు పరలోకం నుండి పెద్ద వస్త్రం కిందకు దిగివస్తూ, అందులో అన్ని రకాల జంతువులు మరియు పక్షులు ఉన్నట్లు చూశాడు. ఆ జంతువులను తినమని చెప్పే స్వరాన్ని పేతురు విన్నాడు. కానీ ఇవి యూదులు తినడానికి అనుమతి లేని జంతువులు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అవి అపవిత్రమైనవి. పేతురు వాటిని తినాలని అనుకోలేదు.

అపొస్తలుల కార్యములు 10:11–14

పేతురు ఆ దర్శనాన్ని మళ్లీ చూశాడు.

దేవుడు ఏదైనా శుద్ధంగా చేసినట్లయితే, దానిని అపవిత్రమని పిలవకూడదని ఆ స్వరం చెప్పింది. ఆ దర్శనం మూడు సార్లు పునరావృతమైంది. పేతురు దాని అర్థం ఏమిటో ఆలోచించాడు.

అపొస్తలుల కార్యములు 10:15–17

కొర్నేలీ సేవకులను కలవడానికి వెళ్లమని ఒక స్వరం పేతురుకు చెప్పింది.

అదే సమయంలో, ముగ్గురు మనుషులు అతనిని వెతుకుతున్నారని పరిశుద్ధాత్మ పేతురుకు, చెప్పింది. “వారితోకూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని” పరిశుద్ధాత్మ అతనితో చెప్పెను.

అపొస్తలుల కార్యములు 10:16–21

పేతురు కొర్నేలీ సేవకులతో మాట్లాడాడు.

ఆ ముగ్గురు మనుషులు కొర్నేలీ సేవకులు. కొర్నేలీ చూసిన దూత గురించి వారు పేతురుకు చెప్పారు. అతనికి బోధించడానికి రావాలా అని వారు పేతురును అడిగారు. సాధారణంగా పేతురు మరియు ఇతర అపొస్తలులు, యూదులు కాని వారి ఇళ్లలోకి వెళ్లేవారు కాదు, అలాగే వారికి సువార్తను బోధించేవారు కాదు. కానీ తన దర్శనాన్ని గుర్తు చేసుకుని, పేతురు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 10:22, 28

పేతురు, కొర్నేలీ, అతని కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను కలిశాడు.

పేతురు వచ్చినప్పుడు, కొర్నేలీ, తన కుటుంబం మరియు స్నేహితులతో కలిసి అతని కోసం వేచి ఉన్నాడు. దేవుడు మాకు చెప్పమని ఆజ్ఞాపించిన దేనినైనా వినడానికి సిద్ధంగా ఉన్నామని వారు పేతురుకు చెప్పారు.

అపొస్తలుల కార్యములు 10:26, 33

పేతురు యేసు క్రీస్తు గురించి బోధిస్తున్నాడు.

ఆ దర్శనంలో దేవుడు తనకు ఏమి బోధిస్తున్నాడో ఇప్పుడు పేతురు అర్థం చేసుకున్నాడు. దేవుడు ఒక దేశాన్ని లేదా ప్రజల సమూహాన్ని మరొక దేశము కంటే ఎక్కువగా ప్రేమించడని పేతురు అందరికీ చెప్పాడు. దేవుడు తనను అనుసరించే మరియు సరైనది చేసే ఎవరినైనా అంగీకరిస్తారు. పేతురు, కొర్నేలీకి, అతని కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు యేసు క్రీస్తు గురించి బోధించాడు.

అపొస్తలుల కార్యములు 10:34–43

పేతురు కొర్నేలీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు బాప్తిస్మము ఇచ్చాడు.

ఆయన బోధించుచుండగా, వింటున్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చెను. యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందవలెనని పేతురు వారిని ఆహ్వానించాడు. దేవుని పిల్లలందరూ యేసు క్రీస్తు సంఘంలోనికి స్వాగతించబడతారని పేతురు తెలుసుకున్నాడు. యేసు క్రీస్తు యొక్క సువార్త అందరికీ ప్రకటించబడింది.

అపొస్తలుల కార్యములు 10:44–48