లేఖన కథలు
ఒక దేవదూత పేతురును చెరసాల నుండి విడిపించెను—దేవుడు ప్రార్థనలకు జవాబిస్తారు


అపొస్తలుల కార్యములు 12:1–17

ఒక దేవదూత పేతురును చెరసాల నుండి విడిపించెను

దేవుడు ప్రార్థనలకు జవాబిస్తారు

పేతురును చెరసాలలో ఉంచారు.

హేరోదు అనే ఒక రాజుకు క్రైస్తవులంటే ఇష్టం ఉండేది కాదు. అతను అపొస్తలుడైన యాకోబును చంపాడు. తరువాత అతను పేతురును చెరసాలలో వేయించాడు. చెరసాలకు కాపలాగా 16 మంది సైనికులను నియమించాడు.

అపొస్తలుల కార్యములు 12:1–4

పేతురు కోసం ప్రార్థిస్తున్న ప్రజలు.

ఇది విన్నప్పుడు, సంఘ సభ్యులు పేతురు కోసం పరలోక తండ్రికి ప్రార్థించారు.

అపొస్తలుల కార్యములు 12:5

చెరసాలలో నిద్రిస్తున్న పేతురు.

ఒక రాత్రి పేతురు నిద్రిస్తున్నాడు. ఇద్దరు సైనికుల మధ్య అతను రెండు గొలుసులతో బంధించబడ్డాడు.

అపొస్తలుల కార్యములు 12:6

పేతురుకు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు.

అకస్మాత్తుగా, చెరసాలలో ఒక వెలుగు ప్రకాశించింది మరియు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. “త్వరగా లెమ్మని,” దేవదూత చెప్పగా, పేతురు చేతులపై ఉన్న గొలుసులు కింద పడిపోయాయి. తనను అనుసరించమని దేవదూత పేతురుతో చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 12:7–8

దేవదూత పేతురును కాపలాదారులను దాటి నడిపించాడు.

పేతురు తాను కల కంటున్నానని అనుకున్నాడు. అతను కాపలాదారులను దాటి దేవదూతను అనుసరించాడు. ఆ పట్టణానికి దారితీసే ఇనుప ద్వారం దానంతట అదే తెరుచుకుంది, పేతురు మరియు దేవదూత దాని గుండా నడిచారు.

అపొస్తలుల కార్యములు 12:9–10

పట్టణంలో ఒంటరిగా పేతురు నడుస్తున్నాడు.

దేవదూత వెళ్ళిపోయాడు మరియు పేతురు తాను కలలు కనడం లేదని గ్రహించాడు. తనను రక్షించడానికి ప్రభువు దూతను పంపారని అతనికి తెలుసు.

అపొస్తలుల కార్యములు 12:10–11

పేతురు మరియ ఇంటి తలుపు తట్టాడు.

పేతురు మరియ అనే స్త్రీ ఇంటికి వెళ్ళాడు, అక్కడ చాలా మంది సంఘ సభ్యులు ప్రార్థన చేయడానికి వచ్చారు. అతను తలుపు తట్టాడు.

అపొస్తలుల కార్యములు 12:12–13

రొదే తలుపు వెనుక పేతురు స్వరం వింటుంది.

రొదే అనే అమ్మాయి తలుపు దగ్గరకు వచ్చింది. పేతురు స్వరం విన్నప్పుడు, ఆమె చాలా సంతోషించింది! ఇతరులకు చెప్పడానికి ఆమె పరిగెత్తింది.

అపొస్తలుల కార్యములు 12:13–14

పేతురు తలుపు దగ్గర ఉన్నాడని రొదే సంఘ సభ్యులకు చెబుతుంది.

పేతురు తలుపు దగ్గర ఉన్నాడని రొదే అందరికీ చెప్పినప్పుడు, వారు ఆమెను నమ్మలేదు. పేతురు తలుపు తడుతూనే ఉన్నాడు.

అపొస్తలుల కార్యములు 12:15–16

ప్రభువు తనను చెరసాల నుండి బయటకు తీసుకువచ్చారని పేతురు సంఘ సభ్యులకు చెప్పాడు.

చివరికి, వారు తలుపు తెరిచి అది నిజమేనని చూశారు. పేతురు సురక్షితంగా ఉన్నాడు! ప్రభువు వారి ప్రార్థనలకు జవాబిచ్చారు. ప్రభువు తనను చెరసాల నుండి ఎలా విడిపించారో పేతురు అందరికీ చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 12:16–17