లేఖన కథలు
పరిచయం: క్రొత్త నిబంధన గురించి—యేసు క్రీస్తు మరియు ఆయన అనుచరుల కథ


పరిచయము

క్రొత్త నిబంధన గురించి

యేసు క్రీస్తు మరియు ఆయన అనుచరుల కథ

ఒక ప్రాచీన ప్రవక్త ఒక కాగితపు చుట్టపై వ్రాస్తున్నాడు.

బైబిలు రెండు భాగాలను కలిగి ఉంది: పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన. పాత నిబంధనలో చాలా కాలం నాటి ప్రవక్తల రచనలు ఉన్నాయి. దేవుడు ఒక రక్షకుడిని పంపుతానని వాగ్దానం చేశారు అని ఈ ప్రవక్తలలో కొందరు వ్రాశారు. ఆయన దేవుని కుమారుడై ఉండి, మనల్ని పాపం మరియు మరణం నుండి రక్షిస్తారు, తద్వారా మనం మళ్ళీ దేవునితో జీవించగలము.

యెషయా 53:3–5; యాకోబు 7:11; మోషే 4

మరియ శిశువైన యేసును ఎత్తుకొని ఉంది.

క్రొత్త నిబంధన ఈ వాగ్దానం ఎలా నెరవేరిందో చెబుతుంది. అది దేవుని కుమారుడైన యేసు క్రీస్తు జననం గురించి చెబుతుంది.

లూకా 2:4–7

ఒక జనసమూహానికి బోధిస్తున్న యేసు.

క్రొత్త నిబంధన యేసు యొక్క జీవితం గురించి కూడా చెబుతుంది. ఆయన యూదుల మధ్య నివసించారు మరియు ఏదో ఒక రోజు మనం పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళడానికి ఎలా జీవించాలో నేర్పించారు.

మత్తయి 5:1–2

యేసు ఒక బిడ్డను ప్రేమతో చూసుకుంటున్నారు.

యేసు ప్రజలను ఆశీర్వదించి సేవ చేశారు. ఆయన వారి కొరకు అనేక అద్భుతాలు చేసారు, రోగులను స్వస్థపరచడం మరియు మరణించిన వారిని తిరిగి బ్రతికించడం వంటివి.

మత్తయి 4:23

యేసు తన అపొస్తలులలో ఒకరిని నియమిస్తున్నారు.

యేసు తన అనుచరులలో పన్నెండు మందిని అపొస్తలులుగా ఎన్నుకున్నారు. తన సంఘమును నడిపించడానికి కూడా ఆయన వారికి అధికారం ఇచ్చారు.

లూకా 9:1–2

సమాధి నుండి బయటకు వస్తున్న యేసు.

ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, యేసు మన బాధను, దుఃఖాన్ని మరియు పాపాలన్నింటినీ తనపై తీసుకున్నారు. ఆయన మన కొరకు మరణించారు. మూడు రోజుల తరువాత, ఆయన మరణాన్ని అధిగమించి పునరుత్థానుడయ్యారు! యేసు క్రీస్తు జీవిస్తున్నారు మరియు ఆయన వలననే, మనం మన పాపాలకు పశ్చాత్తాపపడి, మరణించిన తర్వాత మళ్ళీ జీవించగలము.

ఆల్మా 7:11–13

క్రొత్త నిబంధన చదువుతున్నఇద్దరు ఆధునిక పిల్లలు .

యేసును తెలిసిన మరియు ప్రేమించిన వ్యక్తులు వీటన్నింటి గురించి వ్రాశారు. సంఘ సభ్యులు యేసు క్రీస్తునందు తమ విశ్వాసాన్ని పెంచుకోవడానికి సహాయపడేలా ఆయన అపొస్తలులు లేఖలు వ్రాశారు. వారు వ్రాసిన విషయాలు చాలా సంవత్సరాలుగా భద్రపరచబడ్డాయి. ఇప్పుడు మీరు వాటిని క్రొత్త నిబంధనలో చదివి యేసు క్రీస్తును ఎలా అనుసరించాలో నేర్చుకోవచ్చు.

లూకా 1:1–4