లూకా 7:36–50 చూడండి.
యేసు ఒక స్త్రీని క్షమిస్తారు
“ఆమె విస్తారముగా ప్రేమించెను”
సీమోను అనే వ్యక్తి యేసును తన ఇంటికి వచ్చి తనతో కలిసి భోజనం చేయమని ఆహ్వానించాడు. సీమోను పరిసయ్యులు అని పిలువబడే నాయకుల సమూహంలో ఒకడు.
లూకా 7:36
వారు భోజనం చేస్తుండగా, ఒక స్త్రీ సీమోను ఇంటికి వచ్చింది. యేసు అక్కడ ఉన్నారని ఆమె విన్నది. ఆమె ఆయన పట్ల తనకున్న కృతజ్ఞతను మరియు ప్రేమను చూపించాలనుకుంది.
లూకా 7:37
ఆ స్త్రీ యేసును చూసి ఏడ్చింది. ఆమె కన్నీళ్లు ఆయన పాదాలను కడిగాయి. తరువాత ఆమె తన జుట్టుతో ఆయన పాదాలను తుడిచింది. ఆమె ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని వాటిపై సుగంధ తైలం పూసింది.
లూకా 7:38
ఈ స్త్రీ చాలా పాపాలు చేసిందని సీమోనుకు తెలుసు. యేసు నిజంగా దైవజనుడైతే, ఈ స్త్రీ పాపి అని ఆయనకు తెలుస్తుందని, తను ఆమెను తాకనివ్వడని అతను అనుకున్నాడు.
లూకా 7:39
సీమోను ఏమి ఆలోచిస్తున్నాడో యేసుకు తెలుసు. ఆ స్త్రీ తనను ప్రేమించింది కాబట్టే తన పాదాలు కడిగిందని ఆయన సీమోనుతో చెప్పారు. సాధారణంగా, అతిథులకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చేవారు. యేసు పట్ల ప్రేమను చూపించడానికి సీమోను అలాంటిదేమీ చేయలేదు.
లూకా 7:40–47
ఆమె తనను ప్రేమించి, తనపై విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె పాపాలు క్షమించబడ్డాయని యేసు ఆ స్త్రీతో చెప్పారు. ఆమె సమాధానముగా వెళ్ళవచ్చని ఆయన ఆమెకు చెప్పారు.
లూకా 7:47–50