మార్కు 8:22–25
యేసు ఒక గ్రుడ్డివానిని స్వస్థపరుస్తారు
కాలక్రమేణా జరిగే స్వస్థత
బేత్సయిదా అనే ఊరిలో, ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసు వద్దకు తీసుకొని వచ్చారు. అతనికి చూపు వచ్చేలా యేసు అతన్ని ఆశీర్వదించాలని వారు కోరుకున్నారు.
మార్కు 8:22
యేసు ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరి వెలుపలికి తీసుకువెళ్ళారు. అప్పుడు యేసు ఆ వ్యక్తి మీద తన చేతులుంచి అతన్ని ఆశీర్వదించారు.
మార్కు 8:23
యేసు ఆ వ్యక్తిని నీకేమైనను కనబడుచున్నదా అని అడిగారు. ఆ వ్యక్తి కన్నులెత్తి చూశాడు. అతను కొంచెం చూడగలను, కానీ అంత స్పష్టంగా కనిపించడం లేదు అని చెప్పాడు. మనుషులు నడిచే చెట్లలా కనిపిస్తున్నారని అతను అన్నాడు.
మార్కు 8:23–24
యేసు ఆ వ్యక్తిని మళ్ళీ ఆశీర్వదిస్తారు. ఈసారి, అతను కన్నులెత్తి చూసేసరికి, అంతా స్పష్టంగా ఉంది. యేసు అతడిని స్వస్థపరిచారు!
మార్కు 8:25