మత్తయి 26:36–46; లూకా 22:39–46
గెత్సేమనేలో యేసు
లోక పాపముల కొరకు శ్రమపడటం
యేసు మరియు ఆయన అపొస్తలులు గెత్సెమనే అనే తోటకు వెళ్లారు. యేసు పేతురు, యాకోబు, యోహానును తనను అనుసరించమని అడిగి, మిగిలిన వారిని అక్కడే వేచి ఉండమని చెప్పారు.
మత్తయి 26:36–37; యోహాను 18:1
తాను చాలా దుఃఖంగా ఉన్నానని యేసు పేతురు, యాకోబు, యోహానులకు చెప్పారు. ప్రార్థిస్తున్నప్పుడు తనతో కలిసి మేల్కొని ఉండమని ఆయన వారిని అడిగారు.
మత్తయి 26:38
ఆ తరువాత యేసు మరికొంచెం దూరం తోటలోకి నడుచుకుంటూ వెళ్లారు. మనం పశ్చాత్తాపపడి క్షమాపణ పొందేలా ఆయన మన పాపముల కొరకు శ్రమపడటం ప్రారంభించారు. యేసు మన బాధలను, రోగములను, మరియు దుఃఖాలన్నిటినీ అనుభవించారు కాబట్టి మనకు ఎలా సహాయపడాలో ఆయనకు తెలుసు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇలా చేశారు. ఇది అంతా పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో భాగమే.
మత్తయి 26:39; లూకా 22:41; రోమీయులకు 3:23; ఆల్మా 7:11–13; 3 నీఫై 27:19 కూడా చూడండి.
యేసు యొక్క శ్రమ చాలా ఎక్కువగా ఉండడంతో, ఆ బాధను తీసివేయగలరా అని ఆయన పరలోక తండ్రిని ప్రార్థించారు. కానీ ఆయన తన తండ్రి కోరినదాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక”, అని ఆయన అన్నారు.
లూకా 22:42
యేసు పేతురు, యాకోబు, యోహాను దగ్గరకు వెళ్లి వారు నిద్రపోతున్నారని చూశారు. ఆయన వారిని నిద్రలేపి, మేల్కొని ఉండి ప్రార్థించమని మళ్లీ అడిగారు. కానీ వారు మేల్కొని ఉండాలని కోరుకున్నప్పటికీ, వారు చాలా అలసిపోయి ఉన్నారని ఆయనకు తెలుసు.
మత్తయి 26:40–41
యేసు మరలా ప్రార్థించారు. ఆయనను బలపరచడానికి ఒక దేవదూత వచ్చాడు. ఆయన చాలా శ్రమపడ్డారు మరియు ఆయన ఇంకా గట్టిగా ప్రార్థించారు. ఆయన చెమట రక్తపు బిందువులవలె నేలపై పడింది,
మత్తయి 26:42; లూకా 22:43–44; మోషైయ 3:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 19:16–19 కూడా చూడండి.
ఇంకా రెండు సార్లు, యేసు పేతురు, యాకోబు, యోహానుల దగ్గరకు వెళ్లి వారు నిద్రపోతున్నారని చూశారు. చివరికి ఆయన వారిని నిద్రలేపాడు, ఎందుకంటే ఆయనను తీసుకుపోయే సమయం వచ్చేసింది.
మత్తయి 26:43–46