మార్కు 12:41–44
ఒక విధవరాలు మరియు రెండు చిన్న కాసులు
యేసు త్యాగం గురించి బోధిస్తున్నారు
యేసు యెరూషలేములోని దేవాలయానికి వెళ్ళారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు, ప్రజలు దేవాలయ పనుల కోసం డబ్బు ఇవ్వడాన్ని గమనించారు. చాలా మంది ధనవంతులు ఎక్కువ డబ్బులు ఇచ్చారు.
మార్కు 12:41
అప్పుడు ఒక పేద విధవరాలు రెండు చిన్న కాసులు ఇచ్చింది. అది పెద్ద మొత్తమేమీ కాదు, కానీ ఆమె దగ్గర ఉన్న డబ్బంతా అదే.
మార్కు 12:42, 44
యేసు ఆ విధవరాలిని చూసి, ఆమె చేసింది చూడటానికి రమ్మని తన శిష్యులను పిలిచారు.
మార్కు 12:43
ఆ విధవరాలు అందరికంటే ఎక్కువగా ఇచ్చిందని యేసు చెప్పారు. ధనవంతులు చాలా డబ్బు ఇచ్చారు, కానీ అది వారి వద్ద ఉన్న సంపదలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ఆ విధవరాలు చాలా తక్కువ డబ్బు ఇచ్చింది, కానీ ఆమె తన వద్ద ఉన్నదంతా ఇచ్చివేసెను.
మార్కు 12:43–44