లూకా 17:11–19
కుష్టు వ్యాధి ఉన్న పది మందిని యేసు స్వస్థపరిచారు
కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యత
యేసు ప్రయాణిస్తూ, ఆయన ఒక గ్రామంలోకి ప్రవేశించారు మరియు కుష్టు అనే తీవ్రమైన చర్మ వ్యాధి ఉన్న పది మందిని చూశారు. ఇతరులకు వ్యాధి సోకకుండా ఉండేందుకు కుష్టురోగులు అందరి నుండి, వారి కుటుంబాల నుండి కూడా దూరంగా ఉండాల్సి వచ్చేది.
లూకా 17:11–12
ఆ మనుష్యులు యేసును పిలిచి తమను స్వస్థపరచమని ఆయనను అడిగారు. యేసు వారిని పట్టణంలోని యాజకుల దగ్గరకు వెళ్ళమని చెప్పారు. వారు మళ్ళీ ఇతరులతో ఉండగలరా లేదా అని యాజకులు మాత్రమే నిర్ణయించగలరు.
లూకా 17:13–14; లేవీయకాండము 14:2–3 కూడ చూడుము.
పది మంది రోగులు యాజకులను సందర్శించడానికి నడుచుకుంటూ వెళుతుండగా, ఒక అద్భుతం జరిగింది. వారి అనారోగ్యం పోయింది. వారు స్వస్థత పొందారు!
లూకా 17:14
ఆ మనుష్యులలో ఒకడు తాను స్వస్థత పొందాడని గమనించి, వెనక్కి తిరిగి బిగ్గరగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. అతను ఒక సమరయుడు.
లూకా 17:15–16
ఆయన చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పడానికి ఆ వ్యక్తి యేసు పాదాలపై పడిపోయాడు. స్వస్థత పొందిన మిగిలిన తొమ్మిది మంది పురుషులు ఎక్కడ ఉన్నారని యేసు అడిగారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒకే ఒక్క వ్యక్తి తిరిగి వచ్చాడు! అప్పుడు యేసు, “నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.”
లూకా 17:16–19