మత్తయి 5–7
యేసు కొండమీద ప్రసంగాన్ని బోధించారు
మన పరలోక తండ్రిలా మారడానికి మనకు సహాయం చేయడం
యేసు మరియు ఆయన శిష్యులు గలిలయ సముద్రం దగ్గర ఉన్న ఒక కొండకు వెళ్ళారు. అక్కడ యేసు మనం సంతోషంగా ఎలా ఉండవచ్చో మరియు మన పరలోక తండ్రిలా ఎలా మారవచ్చో వారికి బోధించారు.
మత్తయి 5:1–2
ప్రజలు వినయంగా, హృదయశుద్ధిగలవారుగా ఉండి, సరైనది చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు దీవించబడుదురు మరియు వారు సంతోషంగా ఉంటారని యేసు బోధించారు. ఇతరులను క్షమించే వ్యక్తులు క్షమించబడతారు. సమాధానపరచువారు దేవుని కుమారులనబడుదురు.
మత్తయి 5:3–9
తన శిష్యులు లోకమునకు వెలుగైయున్నారు అని యేసు చెప్పారు—అందరూ చూడగలిగే కొండమీదనుండు పట్టణమువంటి వారు. మనం మన వెలుగును దాచకూడదు.
మత్తయి 5:14
మనం యేసును అనుసరించినప్పుడు, గదిలోని ప్రతి ఒక్కరికీ వెలుగునిచ్చే కొవ్వొత్తిలా ఉంటాము. మన మంచి పనులు ప్రజలు పరలోక తండ్రిని విశ్వసించడానికి సహాయపడతాయి.
మత్తయి 5:15–16
మనం ప్రతీఒక్కరిని ప్రేమించాలని యేసు చెప్పారు—మనల్ని ప్రేమించని వారిని కూడా. మనం వారి కొరకు ప్రార్థించాలి. మనం మన పరలోక తండ్రిలా ఉండడానికి ప్రయత్నించాలని యేసు బోధించారు. మనం ప్రజలకు సహాయం చేసినప్పుడు, మనం ఏమి చేసామనేది ప్రతీఒక్కరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన బోధించారు. మనం చేసే మంచి పనులను దేవుడు చూస్తారు మరియు ఆయన మనలను ఆశీర్వదిస్తారు.
మత్తయి 5:38–48; 6:1–4
మనం ప్రార్థన చేసేటప్పుడు, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని చింతించకూడదు. మనం నిజంగా వాటిని ఉద్దేశించకపోతే ప్రతిసారీ ఒకే మాటలను పలకకూడదు. మనం మన హృదయాలలో నుండి మాట్లాడాలి. పరలోక తండ్రి మన ప్రార్థనలను ఆలకిస్తారు మరియు మనకు ఏమి అవసరమో ఆయనకు తెలుసు. మన మాట ఎవరూ వినలేకపోయినా, ఆయన వింటారు.
మత్తయి 6:5–8
మనం ఇతరులకన్నా గొప్పవాళ్లమని అనుకోకూడదు అని యేసు బోధించారు. మనలో ప్రతీఒక్కరికీ సవాళ్లు ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. ఇతరులను తీర్పు తీర్చే బదులు, మనం ఎలా ఉత్తమముగా చేయగలమో ఆలోచించాలి. ప్రజలు మనతో ఎలా వ్యవహరించాలని కోరుకుంటామో అలాగే మనం కూడా వారితో వ్యవహరించాలి.
మత్తయి 7:1–5, 12
తరువాత యేసు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివితక్కువ వ్యక్తి గురించి మరియు బండ మీద తన ఇల్లు కట్టుకున్న జ్ఞాని గురించి ఒక కథ చెప్పారు. తుఫాను వచ్చినప్పుడు ఇసుక మీద ఉన్న ఇల్లు కూలిపోయింది, మరియు బండ మీద ఉన్న ఇల్లు అలాగే నిలిచిపోయింది. మనం ఆయన బోధలను విని వాటిని పాటిస్తే, మనం జ్ఞానిలా ఉంటామని యేసు చెప్పారు.
మత్తయి 7:24–28