లేఖన కథలు
యేసు, ఒక స్త్రీ మరియు ఒక బావి—జీవజలము గురించి బోధించుట


యోహాను 4

యేసు, ఒక స్త్రీ మరియు ఒక బావి

జీవజలము గురించి బోధించుట

యేసు నీళ్ళ కొరకు బావి దగ్గర ఆగారు.

యేసు మరియు ఆయన శిష్యులు గలిలయకు వెళ్లుచుండగా సమరయ మార్గమున నడుచుచున్నారు. వాళ్ళు ఒక బావి దగ్గర నీళ్ళ కొరకు ఆగిపోయారు. యేసు అక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయన శిష్యులు ఆహారం కొనడానికి వెళ్ళారు.

యోహాను 4:3–8

బావి దగ్గర ఒక స్త్రీని నీళ్ళు అడుగుతున్న యేసు.

సమరయ నుండి వచ్చిన ఒక స్త్రీ తన కుండలో నీళ్లు నింపుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది. యేసు ఆమెను దాహమునకు నీళ్ళు అడిగారు. ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. యేసు ఒక యూదుడు, మరియు చాలా మంది యూదులు సమరయులతో మాట్లాడరు.

యోహాను 4:7–9

యేసు ఆ స్త్రీకి సువార్త గురించి బోధిస్తున్నారు.

బావి నీళ్లు తాగేవాళ్లకు మళ్ళీ దాహం వేస్తుందని యేసు ఆమెతో చెప్పారు. కానీ ఆయన ఆమెకు నిత్యజీవము అనే “జీవజలమును” ఇవ్వగలడు మరియు ఆమెకు ఎప్పటికీ దాహం వేయదు. ఆ స్త్రీ తనకు ఈ “జీవజలము” కొంచెం కావాలని చెప్పింది.

యోహాను 4:10–14

యేసు ఆ స్త్రీతో తన భర్తను తీసుకురమ్మని చెబుతున్నారు.

తన భర్తను తీసుకురమ్మని యేసు ఆమెతో చెప్పారు. “నాకు భర్త లేడు,” అని ఆమె చెప్పింది. ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నారని, ఆమెతో నివసించిన వ్యక్తి ఆమె భర్త కాదని యేసు చెప్పారు.

యోహాను 4:16–18

యేసు ఆ స్త్రీతో తానే రక్షకుడిని అని చెబుతున్నారు.

యేసు తన గురించి ఈ విషయాలు తెలుసుకున్నాడని ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. త్వరలో ఒక రక్షకుడు వస్తున్నాడని తనకు తెలుసునని ఆమె చెప్పింది. తానే రక్షకుడిని అని యేసు ఆమెకు చెప్పారు.

యోహాను 4:19, 25–26

బావి వద్ద యేసు చాలా మందికి బోధిస్తున్నారు.

ఆ స్త్రీ తన నీటి కుండను బావి దగ్గర విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఆమె రక్షకుడిని కనుగొన్నానని చాలా మందికి చెప్పింది. వచ్చి ఆయన బోధనను వినమని ఆమె వారిని ఆహ్వానించింది. ఈ స్త్రీ కారణంగా, చాలా మంది సమరయులు యేసు క్రీస్తును విశ్వసించారు.

యోహాను 4:28–29, 39–42