గ్రంధాలయము
తిమోతికి వ్రాసిన పత్రికలు—పౌలు తన యువ స్నేహితుడికి సలహా ఇస్తున్నాడు


1 మరియు 2 తిమోతి

తిమోతికి రాసిన పత్రికలు

పౌలు తన యువ స్నేహితుడికి సలహా ఇస్తున్నాడు

తిమోతికి బోధిస్తున్న అతని తల్లి మరియు అవ్వ.

తిమోతి యేసు క్రీస్తునందు బలమైన విశ్వాసం ఉన్న యువకుడు. ఆయన తల్లి యునీకే మరియు అవ్వ లోయి కూడా గొప్ప విశ్వాసం ఉన్న స్త్రీలు. తిమోతి చిన్నవాడిగా ఉన్నప్పటి నుండి, వారు ఆయనకు లేఖనాల ద్వారా బోధించారు.

2 తిమోతి 1:5; 3:15

పౌలు మరియు తిమోతి కలిసి నడుస్తున్నారు. వర్షం నుండి వారిని రక్షించడానికి పౌలు ఒక వస్త్రమును పట్టుకుని ఉన్నాడు.

తిమోతి మరియు పౌలు మంచి స్నేహితులు. వారు కలిసి పనిచేశారు మరియు ప్రయాణించారు, ప్రభువును సేవించారు మరియు ఆయన సువార్తను పంచుకున్నారు. పౌలు తిమోతిని కొడుకులా ప్రేమించాడు.

ఎఫెసీయులకు 2:19–22; 1 తిమోతి 1:2

పౌలు తిమోతిని ఎఫెసుకు వెళ్లి అక్కడ సంఘాన్ని నడిపించమని ఆదేశిస్తున్నాడు.

పౌలు తిమోతిని ఎఫెసులోని సంఘాన్ని నడిపించమని అడిగాడు. పౌలు వేరే నగరానికి వెళ్ళవలసి వచ్చింది. అతను దూరంగా ఉన్నప్పుడు, తిమోతికి సహాయం చేయడానికి ఒక లేఖ వ్రాశాడు

1 తిమోతి 1:1–3

ప్రజలు సువార్తను తిరస్కరించడాన్ని తిమోతి గమనించాడు.

తరువాత, పౌలు రోములో చెరసాలలో ఉన్నప్పుడు, తిమోతికి మరొక పత్రిక వ్రాశాడు. కష్టకాలం వస్తుందని ఆయన తిమోతిని హెచ్చరించాడు. కొంతమంది సత్యం నుండి తొలగిపోయి దేవుని కంటే లోక విషయాలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారు సత్యం కాని విషయాలను బోధిస్తారు.

2 తిమోతి 3:1–7; 4:3–4

పరిశుద్ధుల బృందానికి సువార్త గురించి బోధిస్తున్న తిమోతి

భయపడకు అని పౌలు తిమోతికి చెప్పాడు. “దేవుడు మనకు శక్తియు ప్రేమయు గల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు,” అని పౌలు చెప్పాడు. తాను నేర్చుకున్న విషయాలను చేస్తూ ఉండమని పౌలు తిమోతికి చెప్పాడు. లేఖనాలు అతన్ని యేసు క్రీస్తు వద్దకు నడిపిస్తాయి.

2 తిమోతి 1:7–9; 3:14–17

పౌలు రోములో జైలులో ఉన్నాడు.

తన జీవితం త్వరలోనే ముగిసిపోతుందని పౌలుకు తెలుసుకున్నాడు. కానీ అతను చనిపోవడానికి భయపడలేదు. తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తన విశ్వాసాన్ని బలంగా ఉంచుకున్నానని పౌలు తిమోతీతో చెప్పాడు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు తనకు శాశ్వత జీవితాన్ని ఇస్తారని అతను విశ్వసించాడు.

2 తిమోతి 4:6–8