లేఖన కథలు
బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించాడు—దేవుడు ఎలీసబెతు మరియు జెకర్యాలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు


లూకా 1:5–25, 57–80

బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించాడు

దేవుడు ఎలీసబెతు మరియు జెకర్యాలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు

జెకర్యా మరియు ఎలీసబెతు ఒక బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు.

జెకర్యా మరియు ఎలీసబెతు దేవుణ్ణి ప్రేమించే నమ్మకమైన వ్యక్తులు. ఒక బిడ్డ పుట్టాలని వారు ప్రార్థించారు. ఇప్పుడు వారు చాలా వృద్ధులు, వారికి ఇంకా పిల్లలు లేరు.

లూకా 1:5–7

జెకర్యా దేవాలయంలో సేవ చేస్తున్నాడు.

జెకర్యా యెరూషలేము దేవాలయంలో సేవ చేసిన యాజకుడు. ఒకరోజు, దేవాలయంలోని పవిత్ర గదిలో ధూపం వేయడానికి అతన్ని ఎంపిక చేశారు.

లూకా 1:8–10

జెకర్యాకు ఒక దేవదూత కనిపించడం.

హఠాత్తుగా, ఒక దూత ప్రత్యక్షమయ్యాడు! జెకర్యా భయపడ్డాడు. ఆ దేవదూత, “జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది” అని అన్నాడు. జెకర్యా మరియు ఎలీసబెతుకు ఒక కుమారుడు పుడతాడని అతను చెప్పాడు. వాళ్ళు అతనికి యోహాను అని పేరు పెట్టాలి. యోహానుకు ఒక ముఖ్యమైన పని ఉందని దేవదూత చెప్పాడు. రక్షకుడు వచ్చినప్పుడు ఆయనను స్వీకరించడానికి ప్రజలు సిద్ధంగా ఉండటానికి ఆయన సహాయం చేస్తాడు.

లూకా 1:12–17

దేవదూతతో మాట్లాడుతున్న జెకర్యా.

దేవదూత చెబుతున్నది జెకర్యా నమ్మలేకపోయాడు. పిల్లలు పుట్టడానికి అతను మరియు ఎలీసబెతు చాలా వృద్ధులు. జెకర్యా తన సందేశాన్ని నమ్మలేదు కాబట్టి, యోహాను పుట్టే వరకు అతను మాట్లాడలేడని దేవదూత చెప్పాడు.

లూకా 1:18–20

జెకర్యా దేవాలయం నుండి బయటకు వెళ్తున్నాడు. అతను మాట్లాడలేకపోతున్నాడు.

దేవాలయం లోపల జెకర్యా ఎందుకు అంత సమయం తీసుకుంటున్నాడో అని ప్రజలు ఆశ్చర్యపోయారు. అతను వెళ్ళిపోతున్నప్పుడు, మాట్లాడలేకపోయాడు. ప్రత్యేకంగా ఏదో జరిగిందని వారు గ్రహించగలిగారు.

లూకా 1:21–23

ఎలీసబెతు మరియు జెకర్యా తమ బిడ్డను ఎత్తుకొని ఉన్నారు.

నెలల తర్వాత, దేవదూత వాగ్దానం చేసినట్లుగానే, ఎలీసబెతుకు ఒక బిడ్డ పుట్టాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు చాలా సంతోషంగా ఉన్నారు! వాళ్ళు ఆ బిడ్డను కలవడానికి వచ్చారు.

లూకా 1:57–59

ఎలీసబెతు మరియు జెకర్యా బిడ్డకు పేరు పెడుతున్నారు.

ఆ బిడ్డకు అతని తండ్రిలాగే జెకర్యా అని పేరు పెట్టాలని వారు అనుకున్నారు. “అతనికి యోహాను అని పేరు పెట్టాలి” అని ఎలీసబెతు చెప్పారు వారు జెకర్యాను అడిగారు, అతను ఇంకా మాట్లాడలేకపోతున్నాడు. “అతని పేరు యోహాను”, అని అతను వ్రాశాడు. అందరూ ఆశ్చర్యపోయారు.

లూకా 1:59–63

ఆ శిశువు ప్రవక్త అవుతాడని చెబుతున్న జెకర్యా.

అకస్మాత్తుగా, జెకర్యా మళ్ళీ మాట్లాడగలిగాడు. అతను దేవునికి కృతజ్ఞతలు చెప్పి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం ఉంచుకున్నారని అతను అందరికీ చెప్పాడు. యోహాను ఒక ప్రవక్త అవుతాడని ఆయన చెప్పాడు. పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకోవాలని యోహాను ప్రజలకు నేర్పిస్తాడు. యేసు క్రీస్తు నుండి నేర్చుకోవడానికి వారు సిద్ధపపడేలా అతను వారికి సహాయం చేస్తాడు.

లూకా 1:64–80