అపొస్తలుల కార్యములు 16:9-40
పౌలు మరియు సీల
ప్రభువు చేసిన అద్భుతాల ద్వారా రక్షించబడ్డారు
ప్రభువు పౌలు మరియు సీలను కలిసి సువార్తను ప్రకటించుటకు పిలిచారు. అక్కడి సంఘాలు ఎలా ఉన్నాయో చూడడానికి వారు అనేక పట్టణాలకు ప్రయాణించారు.
అపొస్తలుల కార్యములు 15:40–41; 16:4–8
ఒక రాత్రి దర్శనంలో, పౌలు మాసిడోనియా నుండి వచ్చిన ఒక మనిషి తన నగరానికి రావాలని అడుగుతున్నట్లు చూశాడు. పౌలు మరియు సీలా వెంటనే బయలుదేరారు. దేవుడు తమను వెళ్లమని కోరుతున్నారని వారికి తెలుసుకున్నారు.
అపొస్తలుల కార్యములు 16:9–10
వారు మాసిదోనియకు వచ్చినప్పుడు, లూదియ అనే స్త్రీ వారి బోధను విన్నది. ప్రభువు లూదియ హృదయాన్ని తెరిచారు. ఆమె పౌలు బోధించిన విషయాలను నమ్మి బాప్తిస్మము తీసుకుంది.
అపొస్తలుల కార్యములు 16:13–15
లూదియ పౌలు మరియు సీలలతో వారు అక్కడ ఉన్నప్పుడు తన ఇంట్లో ఉండవచ్చని చెప్పింది.
అపొస్తలుల కార్యములు 16:15
కానీ పౌలు మరియు సీలలు అక్కడ ఉండటం అందరికీ నచ్చలేదు. వారు బోధించేది కొంతమందికి నచ్చలేదు. వారు పౌలును మరియు సీలను మార్కెట్‌కు తీసుకెళ్ళి, నగర నాయకులకు వారు గొడవ సృష్టిస్తున్నారని చెప్పారు.
అపొస్తలుల కార్యములు 16:16–21
ప్రజలు పౌలు మరియు సీలలపై కోపంగా ఉన్నారు. ఆ నగర నాయకులు పౌలు మరియు సీలల బట్టలు చింపివేసి, వారిని కొట్టాలని అన్నారు.
అపొస్తలుల కార్యములు 16:22–23
తర్వాత, ఆ నగర నాయకులు పౌలు మరియు సీలలను చెరసాలలో పెట్టారు. వారు వారి కాళ్ళను బంధించి, వారిపై కాపలా ఉంచారు.
అపొస్తలుల కార్యములు 16:23–24
ఆ రాత్రి, పౌలు మరియు సీల ప్రార్థన చేసి దేవునికి కీర్తనలు పాడుతుండగా, ఇతర ఖైదీలు విన్నారు. అకస్మాత్తుగా, నేల కంపించడం ప్రారంభమైంది. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, బంధకాలు విప్పబడ్డాయి.
అపొస్తలుల కార్యములు 16:25–26
కావలివాడు మేల్కొని తలుపులు తెరిచి ఉండటం చూశాడు. ఖైదీలు పారిపోయారని, వారిని తప్పించుకోవడానికి అనుమతించడం వల్ల తాను ఇబ్బందుల్లో పడతానని అతను భావించాడు. పౌలు కావలివానికి ఆందోళన చెందవద్దని చెప్పాడు. ఖైదీలందరూ ఇంకా అక్కడే ఉన్నారు.
అపొస్తలుల కార్యములు 16:27–28
కావలివాడు భయపడ్డాడు. అతను పౌలు మరియు సీల పక్కన మోకరిల్లి, “రక్షణపొందుటకు నేనేమి చేయవలెను?” అని అడిగాడు. వారు, “ప్రభువైన యేసు vనందు విశ్వాసముంచుము” అని అన్నారు.
అపొస్తలుల కార్యములు 16:27–31
పౌలు మరియు సీల కావలివానికి మరియు అతని కుటుంబానికి సువార్తను బోధించారు. ఆ కావలివాడు పౌలు మరియు సీల గాయాలను బాగుచేశాడు. ఆ రాత్రి, అతను మరియు అతని కుటుంబం బాప్తీస్మము పొందారు!
అపొస్తలుల కార్యములు 16:32–33