లేఖన కథలు
బాలుడైన యేసు—నేర్చుకోవడం మరియు పెరగడం


లూకా 2:39–52

బాలుడైన యేసు

నేర్చుకోవడం మరియు పెరగడం

తన కుటుంబంతో ఇంట్లో ఉన్న యేసు.

యేసు, మరియ మరియు యోసేపులతో నజరేతు పట్టణంలో పెరిగాడు. కాలక్రమేణా, ఆయన పరలోక తండ్రి గురించి మరింత ఎక్కువగా నేర్చుకున్నాడు. పరలోక తండ్రి తాను చేయాలని కోరుకున్న పనికి ఆయన సిద్ధమయ్యాడు.

లూకా 2:39–40; సిద్ధాంతము మరియు నిబంధనలు 93:12–14

పస్కా పండుగకు యెరూషలేముకు వెళ్తున్న యేసు మరియు ఆయన కుటుంబం.

యేసుకు 12 సంవత్సరాల వయసులో, ఆయన తన కుటుంబంతో, స్నేహితులతో కలిసి పస్కా పండుగ జరుపుకోవడానికి యెరూషలేముకు వెళ్ళాడు. వారు అక్కడ చాలా రోజులు ఉన్నారు.

లూకా 2:41–43

యేసు తమతో లేడని గమనించిన మరియ మరియు యోసేపు.

ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, యోసేపు మరియు మరియ యేసు తమతో లేడని గమనించారు. వారు ఆయనను వెతుకుతూ యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. వారు చాలా ఆందోళన చెందారు.

లూకా 2:44–46

దేవాలయములో బోధిస్తున్న యేసు.

మూడు రోజులు వెతికిన తర్వాత మరియ మరియు యోసేపు చివరికి యేసును కనుగొన్నారు. ఆయన దేవాలయంలో కొంతమంది బోధకులతో లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు. బోధకులు ఆయనను ప్రశ్నలు అడుగుతున్నారు. యేసు ఎంత తెలుసుకున్నాడో, ఎంత అర్థం చేసుకున్నాడో చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు!

లూకా 2:46–47;.

దేవాలయంలో యేసుతో మాట్లాడుతున్న మరియ మరియు యోసేపు .

మరియ యేసును కనుగొనలేకపోయినప్పుడు వారు ఎంతగా ఆందోళన చెందారో ఆయనకు చెప్పింది. యేసు తన పరలోక తండ్రి యొక్క పనిని చేస్తున్నానని చెప్పారు. యేసు తన కుటుంబంతో కలిసి నజరేతుకు తిరిగి వెళ్ళాడు. ఆయన, మరియ మరియు యోసేపులకు విధేయుడయ్యాడు.

లూకా 2:48–52

తన కుటుంబంతో ఇంట్లో ఉన్న యేసు.

యేసు నేర్చుకుంటూనే ఉన్నారు. ఆయన పెద్దవాడై, బలంగా ఎదిగాడు. పరలోక తండ్రి ఆయనను ప్రేమించారు మరియు ఆయన మిషను కోసం సిద్ధం కావడానికి సహాయం చేశాడు. యేసు తన చుట్టూ ఉన్న ప్రజలను ప్రేమించాడు, మరియు వారు కూడా ఆయనను ప్రేమించారు.

లూకా 2:52