లేఖన కథలు
ఘానాలో “స్తంభన”


“ఘానాలో ‘స్తంభన’,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“ఘానాలో ‘స్తంభన’,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1989 జూన్–1990 నవంబరు

2:59

ఘానాలో “స్తంభన”

పరిశుద్ధులు సమకూడలేనప్పుడు విశ్వాసంగా ఉండడం

ఘానాలోని కాఫొరిజువాలో సువార్తను పంచుకుంటున్న ఆలిస్ జాన్సన్ మరియు హెట్టీ బ్రైమా.

ఆలిస్ జాన్సన్ తన స్వదేశమైన ఘానాలో సేవ చేస్తున్న సువార్తికురాలు. యేసు క్రీస్తు గురించి తన సాక్ష్యాన్ని పంచుకోవడం మరియు సంఘ అభివృద్ధికి సహాయం చేయడం ఆమెకు చాలా ఇష్టం.

Saints, 4:416–17

తాము ఇకపై సువార్తను పంచుకోలేమని తెలుసుకుంటున్న ఆలిస్ మరియు హెట్టీ.

ఒకరోజు, ఆలిస్‌కు బాధ కలిగించే వార్త అందింది. ఘానాలోని ప్రభుత్వం ఇకపై సంఘ సమావేశాలు ఉండవని చెప్పింది. సువార్తికులు ఇకపై బోధించలేరు.

Saints, 4:417

తాళం వేసిన సంఘ భవనం వెలుపల పోలీసు అధికారులు.

పోలీసు అధికారులు సువార్తికులను వారి అపార్ట్‌మెంట్‌ల నుండి వెళ్ళిపోయేలా చేసారు మరియు వారి సైకిళ్లను తీసుకెళ్లారు. కొంతమంది సంఘ సభ్యులను జైలులో పెట్టారు. సైనికులు సంఘ భవనాలకు తాళం వేసి, ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ప్రజలు దీనిని “స్తంభన” అని పిలిచారు.

Saints, 4:417–18

ఒక స్నేహితురాలితో నివసించడానికి బయలుదేరిన ఆలిస్.

సువార్తికులు ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆలిస్ మరొక పట్టణంలో ఒక స్నేహితురాలితో నివసించడానికి వెళ్ళింది. తన సువార్తసేవ‌ను ఎప్పటికీ పూర్తి చేయలేనని ఆమె ఆందోళన చెందింది.

Saints, 4:418

ఘానాలోని పరిశుద్ధులు.

ఘానాలోని పరిశుద్ధులు గందరగోళం చెందారు, విచారంగా ఉన్నారు మరియు భయపడ్డారు. ఏమి తప్పు చేశామని వారు ఆశ్చర్యపోయారు. వారు మళ్ళీ ఎప్పుడైనా సంఘానికి వెళ్ళగలరా?

Saints, 4:418

ఇంట్లో సంస్కార కూడికను నిర్వహిస్తున్న పరిశుద్ధులు.

వారు తమ వార్డులతో కలిసి సమావేశం కాలేకపోయినప్పటికీ, పరిశుద్ధులు ప్రభువును ప్రేమించారు మరియు ఆయనను ఆరాధించాలని కోరుకున్నారు. వారు తమ ఇళ్లలో సంస్కార కూడికలను నిర్వహించారు. యాజకత్వం కలిగియున్న కుటుంబ సభ్యులు రొట్టెను మరియు నీటిని ఆశీర్వదించి, దానిని మిగిలిన కుటుంబానికి అందజేశారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 6:32; Saints, 4:419

ఇంట్లో కలిసి సువార్తను పంచుకుంటున్న పరిశుద్ధులు.

నెలల తరబడి స్తంభన కొనసాగింది. పరిశుద్ధులు తమ ఇళ్లలో కీర్తనలు పాడుకుంటూ ఒకరికొకరు సువార్తను బోధించుకున్నారు. వారు తమ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ఒకరినొకరు సందర్శించుకున్నారు. వారు సంఘానికి తిరిగి వెళ్ళగలిగినప్పుడు చెల్లించడానికి తమ దశమభాగాన్ని పక్కన పెట్టారు. స్తంభన ముగియాలని వారు ప్రార్థించారు మరియు ఉపవాసం ఉన్నారు.

Saints, 4:436–37

మళ్ళీ సువార్త సేవ చేయడానికి ఆహ్వానించబడిన ఆలిస్.

చివరకు, 18 నెలల తర్వాత, సంఘము మళ్ళీ సమావేశాలు నిర్వహించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక కొత్త మిషను అధ్యక్షుడు ఆలిస్‌తో మాట్లాడమని అడిగారు, ఆమె ఇప్పుడు కళాశాలలో చదువుతోంది. “చదువు పూర్తయిన తర్వాత నువ్వు తిరిగి వచ్చి సువార్త సేవ చేయాలనుకుంటున్నావా?” అని ఆయన అడిగారు. “లేదు”. “నేను ఇప్పుడే సేవ చేయాలనుకుంటున్నాను!” అని ఆమె చెప్పింది.

Saints, 4:437–39

ఒక సంఘ సమావేశానికి హాజరైన ఘానాలోని పరిశుద్ధులు.

మళ్ళీ సంఘానికి వెళ్ళగలిగినందుకు ఆలిస్ మరియు ఇతర పరిశుద్ధులు చాలా సంతోషంగా ఉన్నారు! స్తంభన తర్వాత మొదటి ఆదివారం, చాలామంది తమ సాక్ష్యాలను చెప్పాలని కోరుకున్నందున, సంస్కార కూడిక రెండు గంటలు కొనసాగింది. ప్రభువు తమను ఎలా ఆశీర్వదించారో మరియు వారి విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి ఎలా సహాయం చేశారో వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:75; Saints, 4:438