లేఖన కథలు
పార్లీ క్షమాపణ అడుగును


“పార్లీ క్షమాపణ అడుగును,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“పార్లీ క్షమాపణ అడుగును,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1837 జనవరి–జూలై

4:9

పార్లీ క్షమాపణ అడుగును

ఒక స్నేహితుని సాక్ష్యము అతని విశ్వాసాన్ని పెంపొందిస్తుంది

తమ నవజాత శిశువును ఎత్తుకున్న థాంక్‌ఫుల్ మరియు పార్లీ ప్రాట్.

థాంక్‌ఫుల్ మరియు పార్లీ ప్రాట్‌లు తమ బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు, వారు కెనడాలో వారి సువార్తసేవ నుండి ఇంటికి వచ్చారు. ప్రభువు వాగ్దానం చేసినట్లుగానే వారికి ఆరోగ్యకరమైన మగబిడ్డ పుట్టాడు.

Saints, 1:270

థాంక్‌ఫుల్ సమాధి వద్ద బిడ్డను ఎత్తుకొని ఉన్న పార్లీ.

పాపం, బిడ్డ పుట్టిన కొన్ని గంటలకే థాంక్‌ఫుల్ చనిపోయింది. ఆమె లేకుండా తాను బిడ్డను చూసుకోలేడని పార్లీకి తెలుసు. అతను తన సువార్తసేవ‌ను పూర్తి చేయడానికి కెనడాకు తిరిగి వెళ్లినప్పుడు బిడ్డను చూసుకోమని కర్ట్‌లాండ్‌‌లోని ఒక మహిళను కోరాడు.

Saints, 1:270

కొత్త బ్యాంకు గురించి జనులతో మాట్లాడుతున్న జోసెఫ్ స్మిత్.

కర్ట్‌లాండ్‌లో, జోసెఫ్ స్మిత్ దేవుని పని కోసం డబ్బును సేకరించడానికి ఒక బ్యాంకును ప్రారంభించాడు. ఇతరులు రుణం తీసుకునేలా తమ డబ్బును బ్యాంకు వినియోగించుకోవడానికి అనుమతించమని అతడు జనులను కోరాడు. కానీ, అనేక కారణాల వల్ల, బ్యాంకు వద్ద తగినంత డబ్బు లేక మూసివేయవలసి వచ్చింది. సంయుక్త రాష్ట్రాల‌లోని ఇతర బ్యాంకులు కూడా విఫలమయ్యాయి.

Saints, 1:260–61, 264–68

కర్ట్‌లాండ్ దేవాలయం లోపల ఉన్న బ్యాంకు గురించి వాదిస్తున్న పరిశుద్ధులు.

పరిశుద్ధులకు జీవితం కష్టంగా మారింది. కొంతమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు మరియు ఇప్పుడు ఆహారం లేదా బట్టలు కొనడానికి తగినంత డబ్బు లేదు. కొంతమంది జోసెఫ్‌పై కోపంగా ఉన్నారు, అతని సన్నిహిత స్నేహితులు కూడా. బ్యాంకు విఫలమైనందున జోసెఫ్ నిజమైన ప్రవక్త కాదని వారు భావించారు.

Saints, 1:264–68, 272275

తన పసిబిడ్డను ఎత్తుకున్న పార్లీ.

ఇది జరుగుతున్నప్పుడు, పార్లీ తన సువార్తసేవ నుండి ఇంటికి వచ్చాడు. బ్యాంకు‌తో సమస్యలు పార్లీకి కూడా జీవితాన్ని కష్టతరం చేసాయి. అతని ఇంటికి చెల్లించడానికి తగినంత డబ్బు ఉండదు మరియు అతడు నివసించడానికి స్థలం ఉండదు.

Saints, 1:270–71

జోసెఫ్‌కు ఉత్తరం రాస్తున్న పార్లీ.

ఇప్పుడు జోసెఫ్‌పై కూడా పార్లీ కోపంగా ఉన్నాడు. అతను జోసెఫ్‌కు ఒక ఉత్తరం రాసాడు. అతను ఇంకా మోర్మన్ గ్రంథాన్ని నమ్ముతున్నాడని జోసెఫ్‌తో చెప్పాడు. కానీ అతను ప్రవక్త గురించి దయలేని మాటలు అన్నాడు. అసలు బ్యాంకును ప్రారంభించడమే తప్పు అని అతను జోసెఫ్‌తో అన్నాడు.

Saints, 1:271

కెనడా నుండి వచ్చిన స్నేహితులను పలకరిస్తున్న పార్లీ.

తరువాత, కెనడా నుండి పార్లీ స్నేహితులు కొందరు కర్ట్‌లాండ్‌కు వచ్చారు. పార్లీ వారికి సువార్త బోధించాడు మరియు అతడిని మళ్లీ చూసినందుకు వారు సంతోషించారు.

Saints, 1:279–80

పార్లీ మరియు ఇతరులు జోసెఫ్‌తో వాదిస్తుండగా గమనిస్తున్న పార్లీ స్నేహితులు.

కానీ జోసెఫ్ స్మిత్ ఒక ప్రవక్త అనే విశ్వాసాన్ని పార్లీ మరియు అనేకమంది ఇతరులు కోల్పోయారని వారు ఆశ్చర్యపోయారు.

Saints, 1:279–80

జాన్ టేలర్‌తో మాట్లాడుతున్న పార్లీ.

కెనడాకు చెందిన పార్లీ స్నేహితుల్లో ఒకరు జాన్ టేలర్. పార్లీ అతన్ని చూసినప్పుడు, అతను జోసెఫ్ స్మిత్‌పై ఎంత కోపంగా ఉన్నాడో జాన్‌కి చెప్పాడు. ఇకపై జోసెఫ్‌ను అనుసరించవద్దని జాన్‌తో చెప్పాడు.

Saints, 1:280

పార్లీతో తన సాక్ష్యాన్ని పంచుకుంటున్న జాన్.

వారు కెనడాలో ఉన్నప్పుడు, జోసెఫ్ స్మిత్ నిజమైన ప్రవక్త అని పార్లీ తన సాక్ష్యాన్ని పంచుకున్నాడని జాన్ పార్లీకి గుర్తు చేసాడు. “నాకు ఇప్పుడు అదే సాక్ష్యం ఉంది,” అని జాన్ చెప్పాడు. “ఆరు నెలల క్రితం ఆ పని నిజమైతే, అది ఈ రోజూ నిజమే. జోసెఫ్ స్మిత్ అప్పుడు ప్రవక్త అయితే, అతను ఇప్పుడు కూడా ప్రవక్తే.”

Saints, 1:280

కర్ట్‌లాండ్ దేవాలయం లోపల జోసెఫ్ మరియు ఇతరులను గమనిస్తున్న పార్లీ.

పార్లీకి తన స్నేహితుడు జాన్ చెప్పింది సరైనదని తెలుసు. అతను జోసెఫ్‌కు కోపంతో రాసిన ఉత్తరం పట్ల బాధపడ్డాడు. ప్రభువు పని చేయడానికి జోసెఫ్ తన వంతు కృషి చేస్తున్నాడని అతనికి తెలుసు. బ్యాంకుతో వచ్చిన సమస్యలకు జోసెఫ్ యేసు క్రీస్తు యొక్క నిజమైన ప్రవక్త కాదని అర్థం కాదు.

Saints, 1:283

జోసెఫ్‌కు క్షమాపణలు చెప్తున్న పార్లీ.

పార్లీ జోసెఫ్ ఇంటికి వెళ్ళాడు. అతను మాట్లాడిన దయలేని మాటలకు చింతిస్తున్నాడని జోసెఫ్‌తో చెప్పాడు. జోసెఫ్ పార్లీని క్షమించాడు, అతని కోసం ప్రార్థించాడు మరియు అతనిని ఆశీర్వదించాడు. పార్లీ మరెన్నో సువార్తసేవలు అందించాడు మరియు జోసెఫ్ స్మిత్ ప్రభువు యొక్క ప్రవక్త అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనులకు చెప్పాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:7–11; Saints, 1:283