“జోసెఫ్ స్మిత్‌ను మొరోనై దూత దర్శించెను,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“జోసెఫ్ స్మిత్‌ను మొరోనై దూత దర్శించెను,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1823
జోసెఫ్ స్మిత్‌ను మొరోనై దూత దర్శించెను
ఒక పరిశుద్ధ గ్రంథము గురించి నేర్చుకొనుట
జోసెఫ్ స్మిత్ యొక్క మొదటి దర్శనము నుండి మూడు సంవత్సరాలు గడిచాయి. అప్పటి నుండి తాను చేసిన కొన్ని పొరపాట్లు గురించి జోసెఫ్ బాధపడ్డాడు. తన గురించి దేవుడు ఏమనుకుంటున్నారని అతడు ఆశ్చర్యపడ్డాడు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:28–29; పరిశుద్ధులు, 1:20
ఒక రాత్రి, అందరూ నిద్రపోయిన తరువాత, జోసెఫ్ ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకు ముందు దేవుడు అతని ప్రార్థనలు ఆలకించాడు, మరియు ఆయన మరలా ఆలకిస్తారని జోసెఫ్‌కు తెలుసు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:29; పరిశుద్ధులు, 1:21–22
జోసెఫ్ ప్రార్థిస్తుండగా, గది వెలుగుతో నింపబడింది. తన మంచం ప్రక్కన ఒక దేవదూత గాలిలో నిలబడటం జోసెఫ్ చూసాడు. తన పేరు మొరోనై అని దేవదూత చెప్పింది. దేవుడు అతనిని పంపాడు. దేవుడు జోసెఫ్‌ను క్షమించాడని మరియు అతడు చేయడాని ఒక కార్యమును కలిగియున్నాడని అతడు చెప్పాడు. ప్రపంచమంతా జనులు జోసెఫ్ గురించి మరియు దేవుడు అతనికిచ్చిన కార్యము గురించి తెలుసుకుంటారు.
బంగారు పేజీలు లేదా పలకలతో చేయబడిన ఒక గ్రంథము ఉన్నదని మొరోనై చెప్పాడు. అది జోసెఫ్ ఇంటి దగ్గరలోని ఒక కొండలో సమాధి చేయబడింది. ఈ గ్రంథము అమెరికాలో చాలాకాలం క్రితం జీవించిన జనులను గూర్చినది. వారికి యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి తెలుసు. జనులు దానిని చదవగలుగునట్లు ఆ గ్రంథాన్ని అనువదించడానికి దేవుడు జోసెఫ్‌కు సహాయపడతారని మొరోనై చెప్పాడు.
ఆ రాత్రి మరియు మరుసటి రోజు మూడుసార్లు మొరోనై దర్శిస్తాడు. తాను చూచిన దానిని జోసెఫ్ తన తండ్రికి చెప్పాడు. జోసెఫ్ తండ్రి సంతోషంగా ఉన్నాడు. “అది దేవుని నుండి ఒక దర్శనము,” అని అతడు జోసెఫ్‌తో చెప్పాడు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:35–50; పరిశుద్ధులు, 1:22–25
జోసెఫ్ స్మిత్ కొండమీదకు వెళ్ళి, ఒక బరువైన రాయి క్రింద బంగారు పలకలను కనుగొన్నాడు. అతడు వాటిని చేరుకున్నప్పుడు, అవి ఎంత విలువైనవి అని ఆలోచించాడు. మొరోనై వచ్చి, పలకలు తీసుకోవడానికి జోసెఫ్ సిద్ధంగా లేడని జోసెఫ్‌కు చెప్పాడు. సిద్ధపడేవరకు ప్రతి సంవత్సరం ఈ స్థలానికి తిరిగి రమ్మని అతడు జోసెఫ్‌కు చెప్పాడు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:51–54; పరిశుద్ధులు, 1:25–27