“జోసెఫ్, ఎమ్మాలు” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)
“జోసెఫ్, ఎమ్మాలు” సిద్ధాంతము మరియు నిబంధనలు
1825–1828
జోసెఫ్ మరియు ఎమ్మాలు
ప్రపంచానికి మోర్మన్ గ్రంథమును తేవడానికి కలిసి పనిచేయుట
ఎమ్మ హేల్, జోసెఫ్ స్మిత్ నివసించిన న్యూయార్క్‌కు దగ్గరలోని, పెన్సిల్వేనియాలోని ఒక పెద్ద కుటుంబంలో పెరిగింది. ఎమ్మా మరియు ఆమె కుటుంబం దేవునియందు నమ్మకముంచారు. ఎమ్మాకు చదవడం, పాడటం, గుర్రపు స్వారీ చేయడం, మరియు తన ఇంటి వద్ద నదిలో నావను నడపడం అంటే ఇష్టం.
పరిశుద్ధులు, 1:31–32
ఎమ్మాకు 21 సంవత్సరాలప్పుడు, జోసెఫ్ స్మిత్ మరియు అతని తండ్రి, ఎమ్మా పొరుగు వారిలో ఒకరి కోసం పని చేయడానికి వచ్చారు. తన ఇంటిలో ఉండమని ఎమ్మా తండ్రి వారిని అడిగాడు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:56–57; పరిశుద్ధులు, 1:31–32
జోసెఫ్ మరియు ఎమ్మా ఒకరినొకరు తెలుసుకున్నారు. వారు కలిసి ఉండటాన్ని ఇష్టపడ్డారు. కానీ ఎమ్మా తల్లిదండ్రులు జోసెఫ్‌ను ఇష్టపడలేదు. అతడు దేవదూతను చూసాడని వారు నమ్మలేదు.
పరిశుద్ధులు, 1:32–33
ఒక సంవత్సరం తర్వాత, తనను వివాహం చేసుకోమని జోసెఫ్ ఎమ్మాను అడిగాడు. జోసెఫ్, ఎమ్మాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారు వివాహం చేసుకున్నారు మరియు న్యూయార్క్‌లోని జోసెఫ్ తల్లిదండ్రులతో నివసించాడానికి వెళ్లారు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:57–58; పరిశుద్ధులు, 1:34–35
బంగారు పలకల గురించి మొరోనై జోసెఫ్‌కు చెప్పినప్పటి నుండి నాలుగు సంవత్సరాలు గడిచాయి. సమయం వచ్చినప్పుడు, ఎమ్మా, జోసెఫ్‌లు పలకలు దాచబడిన కొండ వద్దకు వెళ్ళారు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:59; పరిశుద్ధులు, 1:36–37
దేవదూత మొరోనై జోసెఫ్‌ను కొండపై కలిసి అతనికి పలకలను ఇచ్చాడు. అతడు ఆ పలకలను కాపాడటానికి తనకు శాయశక్తులా కృషి చేస్తే, అవి భద్రంగా ఉంటాయని అతడు జోసెఫ్‌కు చెప్పాడు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:59; పరిశుద్ధులు, 1:37–38
జోసెఫ్ వద్ద బంగారు పలకలు ఉన్నాయని జనులు విన్నారు, వారిలో కొందరు అతడి నుండి పలకలను దొంగిలించడానికి ప్రయత్నించారు. జోసెఫ్ వాటిని దాచడానికి ప్రదేశాలను వెదకాల్సి వచ్చింది. జోసెఫ్ అడవులలోని దాచబడిన ప్రదేశం నుండి పలకలను తెస్తుండగా, కొందరు అతడిని ముట్టడి చేసారు. అతడు వారిని పడగొట్టి తన తల్లిదండ్రుల ఇంటికి పరుగెత్తాడు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:60; పరిశుద్ధులు, 1:38, 40–41
జోసెఫ్ పలకలను ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు అతని సహోదరి వాటిని బల్లపై పెట్టడానికి అతనికి సహాయపడింది. పలకలను ఎవరినీ చూడనివ్వ రాదని మొరోనై జోసెఫ్‌కు చెప్పాడు, కానీ అతని కుటుంబం ఒక వస్త్రములో చుట్టబడిన పలకలను అనుభూతి చెందగలదు.
పరిశుద్ధులు, 1:41
జనులు వాటిని చదువునట్లుగా బంగారు పలకలను అనువదించమని దేవుడు జోసెఫ్‌ను కోరాడు. కానీ న్యూయార్క్‌లోని జనులు పలకలను దొంగిలించడానికి ప్రయత్నించారు. వాటిని భద్రంగా ఉంచడానికి జోసెఫ్ వాటిని దాచవలసి వచ్చింది. కనుక జోసెఫ్ స్మిత్ మరియు ఎమ్మాలు, ఎమ్మా తల్లిదండ్రులకు దగ్గరగా ఉన్న ఇంటికి మారారు. వారు శాంతియుతంగా పలకలను అనువదించగలరని ఆశించారు.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1: 61–62; పరిశుద్ధులు, 1:43, 45–46
జోసెఫ్ స్మిత్ పలకలను అనువదించడం ప్రారంభించాడు. అతడికి సహాయపడటానికి దేవుడు సిద్ధపరచిన ప్రత్యేక సాధనాలను అతడు ఉపయోగించాడు. జోసెఫ్ అనువదించినప్పుడు, అతడు చెప్పిన దానిని ఎమ్మా వ్రాసింది. వారు గంట గంటకు కలిసి పనిచేశారు. ఎమ్మా ఆశ్చర్యపోయింది. తన భర్త దేవుని శక్తి ద్వారా అనువదిస్తున్నాడని ఆమెకు తెలిసింది.
జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:35; పరిశుద్ధులు, 1:49