లేఖన కథలు
స్వస్థత దినము


“స్వస్థత దినము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“స్వస్థత దినము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1839 ఏప్రిల్–జూలై

3:23

స్వస్థత దినము

దేవుని శక్తితో రోగులను దీవించుట

జోసెఫ్ స్మిత్‌‌తో మాట్లాడుతున్న జైలు కాపలాదారుడు.

జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులు మిస్సోరిలో ఖైదీలుగా ఉండగా, కొంతమంది కాపలాదారులు వారిని వేరే జైలుకు తీసుకెళ్లారు. కాపలాదారులు ఖైదీల పట్ల దయ చూపారు. ఒక రాత్రి, తాను నిద్రపోతున్నాడని, జోసెఫ్ మరియు అతని స్నేహితులు పారిపోతే అతను వారిని ఆపడని కాపలాదారుల నాయకుడు జోసెఫ్‌కు చెప్పాడు.

Saints, 1:392–93

తన కుటుంబాన్ని పలకరిస్తున్న జోసెఫ్.

జోసెఫ్ మరియు ఇతర సంఘ నాయకులు పారిపోయారు. క్విన్సీ అనే పట్టణంలో వారి కుటుంబాలు నివసిస్తున్నట్లు వారు కనుగొన్నారు.

Saints, 1:395–96

పరిశుద్ధులకు ఆహారం మరియు ఆశ్రయం ఇస్తున్న జనులు.

క్విన్సీలోని జనులు పరిశుద్ధుల పట్ల దయతో ఉన్నారు. వారు పరిశుద్ధులకు ఆహారం, దుస్తులు మరియు ఉండడానికి స్థలాన్ని ఇచ్చారు.

Saints, 1:377

నావూను నిర్మించడం ప్రారంభించిన పరిశుద్ధులు.

క్విన్సీలోని జనుల దయకు పరిశుద్ధులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే వారికి నివాసం ఉండేందుకు సొంత స్థలం అవసరమని జోసెఫ్‌కు తెలుసు. ఎవరూ కోరుకోని కొంత స్థలాన్ని సంఘ నాయకులు కొనుగోలు చేసారు మరియు పరిశుద్ధులు అక్కడికి వెళ్లడం ప్రారంభించారు.

Saints, 1:399–400

మలేరియాతో బాధపడుతున్న మరో మహిళను చూసుకుంటున్న మహిళ.

ఆ స్థలం ఒక పెద్ద నదికి దగ్గరలో ఉంది. అది తడిగా ఉండి, బురదతో దోమలతో నిండియుంది. దోమలు మలేరియా అనే వ్యాధితో చాలామంది పరిశుద్ధులను చాలా అనారోగ్యానికి గురిచేసాయి. వారిలో కొందరు చనిపోయారు.

Saints, 1:402

అనారోగ్యంతో ఉన్న అబ్బాయికి యాజకత్వ దీవెన ఇస్తున్న జోసెఫ్ స్మిత్ మరియు విల్ఫర్డ్ ఉడ్రఫ్.

చాలామంది జనులు అనారోగ్యంతో ఉన్నారని జోసెఫ్ చూసినప్పుడు, అతను కొంతమంది సంఘ నాయకులను పిలిచి తనతో రమ్మని కోరాడు. ఉదయం అంతా, వారు ఒక్కొక్క కుటుంబానికి వెళ్లి, అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించి, వారిని దీవించారు. వారి జబ్బును నయం చేసేందుకు వారు యేసు క్రీస్తు యొక్క శక్తిని ఉపయోగించారు.

Saints, 1:402

ఎలైజా ఫోర్డమ్‌తో మాట్లాడుతున్న జోసెఫ్.

వారు సందర్శించిన ఒక వ్యక్తి ఎలైజా ఫోర్డమ్. అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడు, అతను త్వరలో చనిపోతాడని అతని భార్య భావించింది. స్వస్థత పొందుతాననే విశ్వాసం ఉందా అని జోసెఫ్ ఎలైజాను అడిగాడు.

Saints, 1:402

స్వస్థత పొందుతాననే విశ్వాసం ఉందని ఎలైజా జోసెఫ్‌కు చెప్పాడు.

“చాలా ఆలస్యం అయిందేమో,” అన్నాడు ఎలైజా. మీరు యేసు క్రీస్తును నమ్ముతున్నారా అని జోసెఫ్ ఎలైజాను అడిగాడు. “నేను నమ్ముతున్నాను, బ్రదర్ జోసెఫ్,” అని అతను జవాబిచ్చాడు.

Saints, 1:402

యాజకత్వ దీవెన పొందిన తర్వాత లేచి నిలబడిన ఎలైజా.

యేసు క్రీస్తు నామములో జోసెఫ్ అతడిని దీవించాడు. ఎలైజా లేచి నిలబడ్డాడు. యేసు అతడిని స్వస్థపరిచారు! తర్వాత ఎలైజా జోసెఫ్‌తో పాటు పక్క ఇంటికి వెళ్లి, అనారోగ్యంతో ఉన్న ఇతర వ్యక్తులను దీవించడంలో అతనికి సహాయం చేసాడు.

Saints, 1:402–3