“యానజీడ కుటుంబము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“యానజీడ కుటుంబము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1950–1951
యానజీడ కుటుంబము
దశమభాగము మరియు యేసు క్రీస్తునందు విశ్వాసము
తొషికో మరియు తోకిచి యానజీడ జపాన్‌లో నివసించేవారు. వారు యేసు క్రీస్తును నమ్మి, ఆయన సంఘములో చేరారు. కానీ ఆ సమయంలో జపాన్‌లో జీవితం కష్టంగా ఉండేది. ఒక యుద్ధం చాలా ఇళ్ళను, భవనాలను కూల్చివేసింది. తొషికో మరియు తోకిచి తమ కుటుంబం కోసం ఒక ఇల్లు కట్టాలనుకున్నారు, కానీ వారు చాలా బీదవారు.
Saints, 3:543
వారు దశమభాగాన్ని చెల్లించాలని ప్రభువు కోరుతున్నారని యానజీడలకు తెలుసు, కానీ వారు చెల్లించగలరో లేదో వారికి తెలియదు. ఏం చేయాలని తొషికో ఒక సువార్తికుడిని అడిగాడు. “దశమభాగం చెల్లించడం మాకు చాలా కష్టం,” అని ఆమె అంది. వారు తమ దశమభాగాన్ని చెల్లిస్తే, వారి స్వంత ఇంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభువు వారికి సహాయం చేస్తారని ఆ సువార్తికుడు వాగ్దానం చేసాడు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 119; Saints, 3:543-44
తొషికో మరియు తోకిచిలకు ఖచ్చితంగా తెలియదు. వారి కొడుకు కోసం పాఠశాలలో భోజనం కొనడానికి సరిపోయేంత డబ్బులు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. కానీ వారు ప్రభువును నమ్మి, దశమభాగం చెల్లించాలని నిర్ణయించుకున్నారు.
Saints, 3:543-44
ప్రభువు యానజీడ కుటుంబాన్ని దీవించారు. త్వరలోనే వారు స్థలం కొని, ఇల్లు కట్టడం ప్రారంభించగలిగారు.
Saints, 3:544
ఒకరోజు ఒక ఇన్‌స్పెక్టర్ వచ్చాడు. వారి స్థలంలో ఒక సమస్య ఉందని, అక్కడ వారు ఇల్లు కట్టలేరని అతను చెప్పాడు. పని ఆపివేయమని అతను పనివారితో చెప్పాడు.
Saints, 3:544
యానజీడలు చాలా బాధపడ్డారు. జరిగిన దానిని వారు సువార్తికులతో చెప్పారు. యానజీడలతో కలిసి ఉపవాసం మరియు ప్రార్థన చేస్తామని సువార్తికులు చెప్పారు.
Saints, 3:545
తరువాత, మరొక ఇన్‌స్పెక్టర్ వచ్చాడు. వారి స్థలంలో ఉన్న సమస్యను పరిష్కరించవచ్చని అతను చెప్పాడు. యానజీడలు తమ ఇల్లు కట్టుకోవచ్చు. “మీరిద్దరూ తప్పకుండా ఏదో మంచిపని చేసియుండాలి,” అని ఆ ఇన్‌స్పెక్టర్ తొషికో మరియు తోకిచిలతో అన్నాడు. ప్రభువు వారిని దీవించారని వారికి తెలుసు. వారు ఆయనను నమ్మి, దశమభాగం చెల్లించినందుకు సంతోషంగా ఉన్నారు.
Saints, 3:545