లేఖన కథలు
జేన్ మానింగ్ నావూకు ప్రయాణించును


“జేన్ మానింగ్ నావూకు ప్రయాణించును,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“జేన్ మానింగ్ నావూకు ప్రయాణించును,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1841–1843

2:58

జేన్ మానింగ్ నావూకు ప్రయాణించును

ప్రభువునందు విశ్వాసముతో నడుచుట

బాప్తిస్మము పొందుతున్న జేన్ మానింగ్.

జేన్ మానింగ్ మరియు ఆమె కుటుంబం కొంతమంది వ్యక్తులు తమను ఇష్టపడని ప్రదేశంలో నివసించారు మరియు వారి చర్మం యొక్క రంగు కారణంగా ఆ వ్యక్తులు వారిపట్ల హీనంగా ప్రవర్తించారు. ఒక రోజు, ఒక సువార్తికుడు బోధిస్తుండగా జేన్ విన్నది. అతని సందేశం నిజమని ఆమెకు తెలుసు. మరుసటి ఆదివారం, ఆమె బాప్తిస్మం తీసుకుంది.

Saints, 1:500–501

నావూకు తమ ప్రయాణం ప్రారంభిస్తున్న జేన్ మరియు ఆమె కుటుంబము.

జేన్ కుటుంబము కూడా సంఘములో చేరింది. పరిశుద్ధులు నావూలో సమకూడాలని ప్రభువు కోరారు. జేన్ ప్రభువును ప్రేమించింది. ఆమె మరియు ఆమె కుటుంబము ఇతర పరిశుద్ధులతో ఉండాలనుకున్నారు. కాబట్టి వారు నావూకు తమ ప్రయాణం ప్రారంభించారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 124:25; Saints, 1:501

పడవలో ప్రయాణించడానికి నిరాకరిస్తున్న జేన్ మరియు ఆమె కుటుంబము.

వారి ప్రయాణంలో కొంత భాగం వారు పడవలో ప్రయాణించారు. పడవ‌లోని చాలా మంది వ్యక్తులు యాత్ర ముగింపులో ప్రయాణం కోసం డబ్బు చెల్లించవచ్చు. కానీ ప్రారంభంలోనే డబ్బు చెల్లించాలని కొంతమంది జేన్ కుటుంబానికి చెప్పారు. వారి దగ్గర సరిపడా డబ్బు లేదు. ఆ వ్యక్తులు వారిని పడవ నుండి దింపారు మరియు వారు లేకుండా పడవ వెళ్ళిపోయింది.

Saints, 1:501

నావూకి నడిచి వెళుతున్న జేన్ మరియు ఆమె కుటుంబము.

జేన్ కుటుంబం ఇంకా 800 మైళ్లు లేదా 1,300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. వారు వంతెన లేకుండా లోతైన ప్రవాహాన్ని దాటవలసి వచ్చింది. వారు బయట పడుకోవలసి వచ్చింది. వాతావరణం తరచుగా చాలా చల్లగా ఉండేది. కానీ జేన్ కుటుంబం నావూ చేరుకోవాలని నిశ్చయించుకుంది. వారు నడుస్తున్నప్పుడు పాటలు పాడుతూ తమను తాము ఉత్సాహపరచుకున్నారు.

Saints, 1:501, 505–6

ఒక కుటుంబ సభ్యుడిని చూసుకుంటున్న జేన్.

జేన్ మరియు ఆమె కుటుంబం వారి బూట్లు అరిగిపోయే వరకు మరియు వారి పాదాలకు గాయం అయ్యే వరకు నడుస్తూ ఉన్నారు. కానీ వారు సహాయం కోసం దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆయన వారి పాదాలను స్వస్థపరిచారు.

Saints, 1:505

అనారోగ్యంతో ఉన్న పిల్లవాడికి సహాయం చేస్తున్న జేన్ మరియు ఆమె కుటుంబము.

తమ ప్రయాణంలో కలిసిన వ్యక్తులకు వారు సహాయం చేసారు. వారి విశ్వాసం కారణంగా వారు అనారోగ్యంతో ఉన్న ఒక బిడ్డను బాగుచేయడంలో కూడా సహాయం చేసారు.

Saints, 1:505–6

జేన్‌ను వారి ఇంటికి స్వాగతిస్తున్న ఎమ్మా మరియు జోసెఫ్.

చివరికి, జేన్ మరియు ఆమె కుటుంబం నావూ చేరుకుంది! వారు అలసిపోయారు మరియు ఉండడానికి ఒక స్థలం కావాలి. కాబట్టి వారు ఎమ్మా మరియు జోసెఫ్ ఇంటికి వెళ్లారు. వారు అనుభవించినదంతా విన్న జోసెఫ్ జేన్‌తో, “దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మీరు ఇప్పుడు స్నేహితుల మధ్య ఉన్నారు,” అన్నాడు. జోసెఫ్ మరియు ఎమ్మా తమతో కలిసి ఉండమని జేన్‌ను ఆహ్వానించారు.

Saints, 1:506