లేఖన కథలు
యేసు క్రీస్తు యొక్క సంఘము ఏర్పాటు చేయబడింది


“యేసు క్రీస్తు యొక్క సంఘము ఏర్పాటు చేయబడింది,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“యేసు క్రీస్తు యొక్క సంఘము ఏర్పాటు చేయబడింది,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1830 ఏప్రిల్

2:37

యేసు క్రీస్తు యొక్క సంఘము ఏర్పాటు చేయబడింది

సంతోషకరమైన సంఘ సమావేశము

సంఘము యొక్క మొదటి సమావేశం కోసం విట్‌మర్ ఇంటికి జనులను స్వాగతిస్తున్న జోసెఫ్ స్మిత్.

మోర్మన్ గ్రంథము ఇప్పుడు ముద్రించబడింది, మరియు దేవుని యాజకత్వ శక్తి మరలా భూమి మీద ఉన్నది. యేసు క్రీస్తు యొక్క సంఘమును ఏర్పాటు చేయడానికి ఇది సమయమని ప్రభువు జోసెఫ్‌కు చెప్పారు.

పరిశుద్ధులు, 1:84

సంఘ నాయకులుగా జోసెఫ్, ఆలీవర్‌లను ఆమోదించటానికి జనులు వారి చేతులను పైకెత్తారు.

1830 ఏప్రిల్ 6న, దాదాపు 40 మంది స్త్రీలు మరియు పురుషులు విట్‌మర్ కుటుంబ గృహములో సంఘాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చారు. ఆయన సంఘాన్ని నడిపించడానికి ప్రభువు జోసెఫ్ మరియు ఆలీవర్‌లను పిలిచారు. తమ నాయకులుగా వారిని ఆమోదించినప్పుడు, వారి చేతులను పైకెత్తమని జనులను జోసెఫ్ మరియు ఆలీవర్‌ అడిగారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:1–3; పరిశుద్ధులు, 1:84

క్రొత్త సంఘ సభ్యులు సంస్కారము తీసుకోవడానికి సంతోషించారు.

తరువాత, జోసెఫ్ మరియు ఆలీవర్‌లు సంస్కారమును దీవించారు. యేసు క్రీస్తును గుర్తుంచుకోవాడనికి వారికి సహాయపడటానికి వారు జనులకు దానిని ఇచ్చారు. తరువాత జోసెఫ్ మరియు ఆలీవర్‌లు బాప్తీస్మము పొందిన జనుల తలలపై వారి చేతులను ఉంచారు. వారు వీరిని సంఘ సభ్యులుగా నిర్ధారించారు మరియు వారికి పరిశుద్ధాత్మ వరమును ఇచ్చారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 20:75–79; పరిశుద్ధులు, 1:85

జోసెఫ్ సంఘము యొక్క క్రొత్త సభ్యులకు బోధిస్తున్నాడు.

క్రొత్త సంఘము కోసం ప్రభువు జోసెఫ్‌కు ఒక సందేశము ఇచ్చారు. సంఘములో జరిగిన దానిని వ్రాయమని ఆయన వారికి చెప్పారు. జోసెఫ్ స్మిత్ తన ప్రవక్త అని ఆయన అన్నారు. ఆయన జోసెఫ్‌కు ఇచ్చిన ఆజ్ఞలను పాటించిన యెడల, ఆయన వారిని దీవిస్తానని సంఘ సభ్యులకు వాగ్దానమిచ్చారు. దయ్యానికి వారిపై అధికారము ఉండదు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 21:1–6; పరిశుద్ధులు, 1:85

జోసెఫ్ స్మిత్ మరియు అతని తండ్రి ఒకరినొకరు హత్తుకుంటున్నారు.

యేసు క్రీస్తు సంఘాన్ని కలిగియున్నందుకు జనులు చాలా సంతోషించారు! సమావేశము తరువాత, జోసెఫ్ యొక్క తల్లి మరియు తండ్రితో సహా, చాలా మంది జనులు బాప్తీస్మము పొందారు. అతని తండ్రి నీటిలోనుండి బయటకు వచ్చినప్పుడు, జోసెఫ్ అతడిని గట్టిగా హత్తుకున్నాడు. “మా నాన్న యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘములోనికి బాప్తీస్మము పొందడం చూడటం కోసం నేను జీవించాను!” అని అతడు అన్నాడు.

పరిశుద్ధులు, 1:86

సంఘమును పునరుద్ధరించడంలో సహాయం చేసినందుకు జోసెఫ్ చాలా కృతజ్ఞత కలిగియున్నాడు.

తరువాత ఆ రాత్రి, జోసెఫ్ ఒంటరిగా ఉండటానికి చెట్ల పొదలలోనికి వెళ్ళాడు. అతని హృదయం సంతోషంతో నింపబడింది. పరలోక తండ్రిని మరియు యేసు క్రీస్తును అతడు చూసినప్పటి నుండి ఇప్పటికి 10 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుండి చాలా విషయాలు జరిగాయి. అతడు యేసు క్రీస్తు సంఘాన్ని పునస్థాపించడానికి లేదా తిరిగి తీసుకొని రావడానికి సహాయం చేయగలిగినందుకు జోసెఫ్ చాలా కృతజ్ఞత కలిగియున్నాడు!

పరిశుద్ధులు, 1:86