లేఖన కథలు
మేరీ మరియు కారొలైన్ రోలిన్స్


“మేరీ మరియు కారొలైన్ రోలిన్స్,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“మేరీ మరియు కారొలైన్ రోలిన్స్,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1830 నవంబరు–1831 జూలై

4:28

మేరీ మరియు కారొలైన్ రోలిన్స్

లేఖనాల పట్ల గాఢమైన ప్రేమ

మోర్మన్ గ్రంథము గురించి సువార్తికులు మాట్లాడడం వింటున్న మేరీ రోలిన్స్.

ఒహైయోలోని కర్ట్‌లాండ్ను సువార్తికులు మొదటిసారి సందర్శించినప్పుడు మేరీ రోలిన్స్‌కు 12 సంవత్సరాలు. వారు మోర్మన్ గ్రంథం గురించి మాట్లాడడం ఆమె విన్నది. ఆ సమయంలో, కర్ట్‌లాండ్‌లో పుస్తకం యొక్క ఒక ప్రతి మాత్రమే ఉంది మరియు అది ఐజాక్ మోర్లీ అనే సంఘ నాయకుడి దగ్గర ఉంది.

మోర్మన్ గ్రంథాన్ని అరువు ఇవ్వమని అడుగుతున్న మేరీ.

మేరీ సహోదరుడు మోర్లీ ఇంటికి వెళ్లి, పుస్తకాన్ని చూడాలని కోరింది. సహోదరుడు మోర్లీ ఆమెను దానిని పట్టుకోనిచ్చాడు. దీనిని ఇంటికి తీసుకెళ్లవచ్చా అని మేరీ అడిగింది.

మోర్మన్ గ్రంథాన్ని అరువు ఇవ్వమని బ్రతిమాలుతున్న మేరీ.

సహోదరుడు మోర్లీ తన పుస్తక ప్రతిని మేరీకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అతను ఇంకా దానిని పెద్దగా చదవలేదు. మేరీ దానిని అరువు ఇవ్వమని సహోదరుడు మోర్లీని వేడుకుంది.

మోర్మన్ గ్రంథాన్ని చదువుతున్న మేరీ.

సహోదరుడు మోర్లీ ఒప్పుకున్నాడు. మరుసటి రోజు త్వరగా తిరిగి తెస్తానంటే మేరీ ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లవచ్చని అతను చెప్పాడు. మేరీ దానిని నిధిలా చూసుకుంది. రాత్రంతా మేల్కొని చదువుతూనే ఉంది.

ఐజాక్ మోర్లీకి పుస్తకాన్ని తిరిగి ఇస్తున్న మేరీ.

మేరీ పుస్తకాన్ని తిరిగి ఇచ్చినప్పుడు, ఆమె చదివిన దాన్ని చూసి సహోదరుడు మోర్లీ ఆశ్చర్యపోయాడు. అతను ఇలా చెప్పాడు, “పాపా, ఈ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి పూర్తి చేయి. నేను ఆగగలను.”

జోసెఫ్ స్మిత్‌ను కలుసుకున్న మేరీ.

కర్ట్‌లాండ్‌లో మోర్మన్ గ్రంథమును పూర్తిగా చదివిన మొదటి వ్యక్తి మేరీ. ఆమె పూర్తి చేసిన వెంటనే, ఆమె ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను కలుసుకుంది. మేరీకి మోర్మన్ గ్రంథమంటే ఎంత ఇష్టమో తెలుసుకున్నప్పుడు, సహోదరుడు మోర్లీ ప్రతిని ఆమె తీసుకోవచ్చని ఆయన చెప్పారు. ఆయన సహోదరుడు మోర్లీకి మరొకటి ఇస్తానన్నారు.

ఆజ్ఞల గ్రంథము ముద్రించబడడాన్ని చూస్తున్న మేరీ.

తరువాత ఆ సంవత్సరంలో, మేరీ మరియు ఆమె కుటుంబం మిస్సోరిలోని ఇండిపెండెన్స్‌కి వెళ్లారు. సంఘ నాయకులు ఆజ్ఞల గ్రంథము అనే కొత్త పుస్తకాన్ని రూపొందించడం ప్రారంభించినప్పుడు దానిని చూడడానికి ఆమె ఉత్సాహంగా ఉంది. ఈ పుస్తకంలో యేసు క్రీస్తు జోసెఫ్ స్మిత్‌కు ఇచ్చిన బయల్పాటులలో అనేకం ఉంటాయి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 67; 70:1–4; Saints, 1:178

ముద్రణ యంత్రాన్ని నాశనం చేస్తున్న కోపంతో నున్న వ్యక్తులు.

కానీ ఇండిపెండెన్స్‌లో కొంతమందికి సంఘము నచ్చలేదు. పరిశుద్ధులు వెళ్ళిపోవాలని వారు కోరుకున్నారు. ఒకరోజు, కోపంతో ఉన్న వ్యక్తులు ఆజ్ఞల గ్రంథము ముద్రించబడుతున్న భవనంలోకి చొరబడ్డారు. వారు ముద్రణ యంత్రాన్ని కిటికీలోంచి విసిరేసి, ఆజ్ఞల గ్రంథములోని పేజీలను వీధిలో చెల్లాచెదురు చేశారు.

Saints, 1:177–78

కంచె వెనుక దాక్కున్న మేరీ మరియు కారొలైన్ రోలిన్స్.

మేరీ మరియు ఆమె సహోదరి కారొలైన్ కంచె వెనుక నుండి చూస్తున్నారు. పేజీలు పాడైపోయే ముందు వాటిని పొందాలని మేరీ కారొలైన్‌తో చెప్పింది. కోపంగా ఉన్న వ్యక్తులను చూసి కారొలైన్ భయపడింది. “వాళ్ళు మనల్ని చంపుతారు,” అందామె. అయితే ఆ పేజీల్లో దేవుని వాక్యం ఉందని మేరీ మరియు కారొలైన్‌లకు తెలుసు.

Saints, 1:178

పారిపోతున్న మేరీ మరియు కారొలైన్ రోలిన్స్.

ఆ వ్యక్తులు కనిపించకుండా పోయేవరకు సహోదరీలు వేచి ఉన్నారు. అప్పుడు వారు వీధిలోకి పరిగెత్తి, వారు పట్టుకోగలిగినన్ని పేజీలు పట్టుకున్నారు. వారు త్వరపడుతుండగా, కొందరు మనుష్యులు వారిని చూసి, ఆగమని అరిచారు. మేరీ మరియు కారొలైన్ ఆ పేజీలను గట్టిగా పట్టుకుని, దగ్గరలో ఉన్న మొక్కజొన్న పొలంలోకి వీలైనంత వేగంగా పరిగెత్తారు.

Saints, 1:178–79

మొక్కజొన్న పొలంలో దాక్కున్న మేరీ మరియు కారొలైన్ రోలిన్స్.

ఇద్దరు వ్యక్తులు సహోదరీలను మొక్కజొన్న పొలం‌లోకి వెంబడించారు. మొక్కజొన్న చాలా పొడవుగా ఉంది, మేరీ మరియు కారొలైన్ తాము ఎక్కడికి వెళ్తున్నారో చూడలేకపోయారు. వారు నేలపై పడుకొని, తమ శరీరాల క్రింద పేజీలను దాచారు. ఇద్దరు వ్యక్తులు తమ కోసం వెదుకుతూ మొక్కజొన్న పొలం గుండా వెళుతుండగా వారు నిశ్శబ్దంగా విన్నారు.

Saints, 1:179

జోసెఫ్ స్మిత్‌‌ చెప్పేది వింటున్న మేరీ మరియు కారొలైన్.

త్వరలోనే ఆ వ్యక్తులు వెళ్ళిపోయారు. మేరీ మరియు కారొలైన్ సురక్షితంగా ఉన్నారు. వారు ఆజ్ఞల గ్రంథము కోసం ప్రభువు యొక్క బయల్పాటుల పేజీలను భద్రపరిచారు. ఈ రోజు ఆ బయల్పాటులు సిద్ధాంతము మరియు నిబంధనల గ్రంథములో ఉన్నాయి.

Saints, 1:179