“జోసెఫ్ స్మిత్ కుటుంబము,” సిద్ధాంతము మరియు నిబంధనలు (2024)
“జోసెఫ్ స్మిత్ కుటుంబము,” సిద్ధాంతము మరియు నిబంధనలు
1805–1817
జోసెఫ్ స్మిత్ యొక్క కుటుంబము
విశ్వాసము యొక్క కుటుంబము
జోసెఫ్ స్మిత్ 1805, డిసెంబరు 23న, ఈశాన్య అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జన్మించాడు. అతని తండ్రి పేరు కూడా జోసెఫ్. అతని తల్లి పేరు లూసీ. అతనికి అనేకమంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారు. జోసెఫ్ స్మిత్ కుటుంబము వ్యవసాయదారులు. వారు దేవునియందు విశ్వసించారు మరియు ఒకరినొకరు ప్రేమిస్తారు.
జోసెఫ్ స్మిత్ బాలునిగా ఉన్నప్పుడు, అతడికి ఒక వ్యాధి కలిగింది, అది అతడి కాలికి సమస్యను కలిగించింది. అది అతనికి చాలా నొప్పి కలిగించింది. జోసెఫ్ కుటుంబం అతనికి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించింది, కానీ అతని కాలు ఇంకా చాలా నొప్పిగా ఉంది. వైద్యులు అతని కాలును బాగు చేయడానికి ప్రయత్నించారు, కానీ వారు చేయలేకపోయారు.
పరిశుద్ధులు, 1:7
జోసెఫ్ ప్రాణాన్ని కాపాడటానికి అతని కాలుని తీసివేయాలని వైద్యులు చెప్పారు. కానీ అతని తల్లి వారిని తీయనివ్వలేదు. జోసెఫ్‌కు సహాయపడటానికి వేరే విధానమేదైనా ఉన్నదా అని ఆమె అడిగింది. బదులుగా అతని కాలులో ఎముక బాగాన్ని తీసివేయాలని వైద్యులు నిర్ణయించారు. ఇది చాలా బాధ కలిగిస్తుందని జోసెఫ్‌కు తెలుసు, కానీ దేవుడు అతనికి సహాయపడతాడని అతనికి విశ్వాసమున్నది.
పరిశుద్ధులు, 1:7
నొప్పి తగ్గించడానికి జోసెఫ్‌కు మద్యము తాగించాలని వైద్యులు భావించారు. కానీ వద్దని జోసెఫ్ చెప్పాడు. అతడు కేవలం తన తండ్రి తనను పట్టుకోవాలని కోరాడు.
పరిశుద్ధులు, 1:7
బయటకు వెళ్లపోమని జోసెఫ్ తన తల్లిని అడిగాడు. వైద్యులు అతని కాలును కోస్తున్నప్పుడు, తాను అంత బాధలో ఉండగా ఆమె చూడటాన్ని అతడు ఇష్టపడలేదు.
అతడి కాలులోని చెడిపోయిన ఎముకను వైద్యులు కోస్తున్నప్పుడు జోసెఫ్ తండ్రి అతడిని పట్టుకున్నాడు. ఇది చాలా నొప్పి కలిగించింది, కానీ ధైర్యంగా ఉండటానికి దేవుడు జోసెఫ్‌కు సహాయపడ్డాడు. కొన్ని సంవత్సరాల తరువాత, జోసెఫ్ కాలు బాగైంది, కానీ నడవడం ఇంకా నొప్పి కలిగించింది.
పరిశుద్ధులు, 1:6–7
జోసెఫ్ పెద్దవాడైనప్పుడు, అతని కుటుంబం న్యూయార్క్ రాష్ట్రానికి మారింది. జోసెఫ్ స్మిత్ కుటుంబము పేదది. వారి కుటుంబం కోసం తగినంత ఆహారం కలిగియుండటానికి వారు కష్టపడి పనిచేస్తారు. జోసెఫ్ స్మిత్ మంచి బాలుడు. అతడు సంతోషంగా ఉన్నాడు మరియు నవ్వడం, సరదాగా ఉండటం ఇష్టపడేవాడు.
పరిశుద్ధులు, 1:5–9
జోసెఫ్ కుటుంబము యేసు క్రీస్తును ప్రేమించింది. వారు ప్రార్థించారు మరియు కలిసి బైబిలు చదివారు. జోసెఫ్ తల్లిదండ్రులు ఏ సంఘానికి చెందినవారో ఖచ్చితంగా వారికి తెలియలేదు. ఒక రాత్రి, జోసెఫ్ తల్లి, లూసీ ప్రార్థన చేసి, యేసు క్రీస్తు యొక్క నిజమైన సంఘాన్ని కనుగొనాలని కోరుతున్నానని దేవునికి చెప్పింది. దేవుడు ఆమె ప్రార్థనకు జవాబిచ్చి, ఆమె కనుగొనేలా చేస్తానని వాగ్దానం చేసారు.
పరిశుద్ధులు, 1:10–11