“హాన్స్ మిల్,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“హాన్స్ మిల్,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1838 అక్టోబరు–1839 ఫిబ్రవరి
హాన్స్ మిల్
ఒక దాడి మరియు ఒక అద్భుతం
విల్లార్డ్ స్మిత్ వయస్సు 11 సంవత్సరాలు. అతని కుటుంబం ఇతర పరిశుద్ధులతో కలిసి మిస్సోరిలోని హాన్స్ మిల్‌లో నివసించింది. వారు ఫార్ వెస్ట్‌లోని పరిశుద్ధులతో త్వరలో సమకూడాలని కోరుకున్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 115:7–8; Saints, 1:347–48
ఒక రోజు, విల్లార్డ్ తన తండ్రి మరియు సోదరులు సార్డియస్ మరియు ఆల్మాతో ఉన్నాడు. హఠాత్తుగా, వారు తుపాకీ కాల్పులు మరియు అరుపులు విన్నారు. పరిశుద్ధులపై దాడి చేయడానికి ప్రజలు వచ్చారు.
Saints, 1:348–49
అందరూ భద్రత కోసం పరిగెత్తారు. చాలామంది పురుషులు మరియు పిల్లలు కమ్మరి దుకాణంలో దాక్కున్నారు. విల్లార్డ్ తండ్రి మరియు సోదరులు కూడా లోపలికి వెళ్లారు, కానీ విల్లార్డ్ వారి నుండి విడిపోయాడు. అతను ఒక చెక్కల కుప్ప వెనుక దాక్కున్నాడు. అతని చుట్టూ కాల్పుల శబ్దాలు వినిపించాయి.
Saints, 1:349, 353
విల్లార్డ్ దాక్కోవడానికి ఒక చోటు నుండి మరొక చోటుకు పరిగెత్తాడు. చివరికి, కాల్పులు ఆగిపోయాయి. దాడి చేసినవారు హాన్స్ మిల్ నుండి వెళ్లిపోయారు.
Saints, 1:353
విల్లార్డ్ తన కుటుంబాన్ని వెదకడానికి కమ్మరి దుకాణానికి వచ్చాడు. అతని తండ్రి మరియు సార్డియస్ చంపబడ్డారు. కానీ విల్లార్డ్ తమ్ముడు ఆల్మా ఇంకా బతికే ఉన్నాడు.
Saints, 1:353
ఆల్మా తుంటికి బుల్లెట్ తగిలింది. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. విల్లార్డ్ ఆల్మాను ఎత్తుకుని వారి కుటుంబ గుడారానికి తీసుకెళ్లాడు.
Saints, 1:353–54
ఆల్మా తుంటికి అయిన గాయాన్ని ఎలా తగ్గించాలో విల్లార్డ్ తల్లి అమండాకు తెలియలేదు. కానీ దేవుడికి తెలుసని ఆమెకు తెలుసు. ఆమె ప్రార్థించింది మరియు ఖచ్చితంగా ఏమి చేయాలో చెప్పే స్వరాన్ని ఆమె విన్నది.
Saints, 1:354
ఆల్మా గాయాన్ని అమండా బూడిదతో కడిగింది. తర్వాత ఆమె ఏదో చెట్టు వేర్లు పొడి చేసి అతని గాయంపై పూసింది. అతని తుంటిని ఆమె బట్టతో చుట్టింది. “అలా పడుకో, కదలకు,” “ప్రభువు నీకు మరో తుంటిని చేస్తారు” అని ఆమె అంది.
Saints, 1:354–55
తర్వాత, పరిశుద్ధులు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని లేదా వారు చంపబడతారని మిస్సోరి గవర్నర్ చెప్పారు. కానీ ఆల్మా తుంటి ఇంకా నయం కాలేదు. అమండా ప్రార్థన చేసి, ప్రభువును సహాయం కోరింది. యేసు ఆమె కుటుంబాన్ని ఎప్పటికీ విడిచిపెట్టరని ఒక స్వరం ఆమెకు చెప్పింది. ఏదీ ఆమెకు బాధ కలిగించలేదని అమండా భావించింది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:83; Saints, 1:372, 378–79
ఆమె ప్రార్థన చేసిన వెంటనే, అమండా తన పిల్లల కేకలు విన్నది. ఆమె వారిని వెదకడానికి పరిగెత్తింది మరియు ఆమె వెళ్ళినప్పుడు, ఆల్మా చుట్టూ పరిగెడుతున్నాడు. “నేను బాగయ్యాను, అమ్మా, నేను బాగయ్యాను!” అని అతను చెప్పాడు. అతని తుంటి నయమైంది! అది ప్రభువు నుండి వచ్చిన అద్భుతం. అమండా మరియు ఆమె పిల్లలు మిస్సోరి నుండి మిగిలిన పరిశుద్ధులతో కలిసి సురక్షితమైన స్థలాన్ని కనుగొనడానికి బయలుదేరారు.
Saints, 1:379