లేఖన కథలు
గ్రేట్ బ్రిటన్‌లో అపొస్తలులు సువార్తసేవ చేస్తారు


“గ్రేట్ బ్రిటన్‌లో అపొస్తలులు సువార్తసేవ చేస్తారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“గ్రేట్ బ్రిటన్‌లో అపొస్తలులు సువార్తసేవ చేస్తారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1838 జూలై–1841 జూలై

2:59

గ్రేట్ బ్రిటన్‌లో అపొస్తలులు సువార్తసేవ చేస్తారు

ప్రభువు యొక్క వాగ్దానాలను నమ్ముట

గ్రేట్ బ్రిటన్‌లో సువార్తసేవ చేయడానికి సంఘము యొక్క అపొస్తలులను పిలవాలనే  బయల్పాటును పొందుతున్న జోసెఫ్ స్మిత్.

జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన ఒక బయల్పాటులో, ప్రభువు సువార్తసేవ చేయడానికి అపొస్తలులను సముద్రం మీదుగా గ్రేట్ బ్రిటన్‌కు పిలిచారు. అపొస్తలులను అంత దూరంలో ఉంచడం జోసెఫ్‌కు కష్టమైనప్పటికీ, అతడు ప్రభువును నమ్మాడు. అపొస్తలులకు కూడా వారి కుటుంబాలను విడిచివెళ్ళడం కష్టమే. కానీ వారిని దీవిస్తానని ప్రభువు వాగ్దానమిచ్చారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 118

హీబర్ కింబల్ మరియు అతని కుటుంబం.

హీబర్ సి. కింబల్ మరియు ఆయన భార్య, వైలేట్‌లకు యువ కుటుంబం ఉంది. వారికి కేవలం నెలరోజుల వయస్సున్న బిడ్డ ఉంది. వారి కుటుంబంలో చాలామంది అనారోగ్యంతో ఉన్నారు.

Saints, 1:405

సువార్తసేవకు వెళ్ళడానికి సిద్ధమవుతోన్న బ్రిగమ్ యంగ్.

బ్రిగమ్ యంగ్ కూడా అనారోగ్యంతో ఉన్నాడు మరియు అతనిది పేద కుటుంబం. కానీ, “వెళ్ళి, నీ సువార్తసేవ చెయ్యి. ప్రభువు నిన్ను దీవిస్తారు,” అని బ్రిగమ్ భార్య మేరీ ఆన్ అతనితో చెప్పింది.

Saints, 1:404-5

హీబర్ సి. కింబల్‌తో ఉంటున్న బ్రిగమ్ యంగ్.

బ్రిగమ్ బయలుదేరాడు, కానీ అతను హీబర్ ఇంటికి చేరుకునేసరికి అతను నడవలేనంత బలహీనంగా ఉన్నాడు. కొద్ది రోజులు అతను హీబర్ కుటుంబంతో ఉండిపోయాడు.

Saints, 1:405

బ్రిగమ్ మరియు హీబర్‌లను చూసుకుంటున్న మేరీ ఆన్ యంగ్.

బ్రిగమ్ మరియు హీబర్‌ల ఆరోగ్యం బాగయ్యేవరకు వారిని చూసుకోవడానికి మేరీ ఆన్ వచ్చింది. వారిద్దరూ చాలా బలహీనంగా ఉన్నారు, కానీ వారు సువార్తను ప్రకటించాలని కోరుకున్నారు.

Saints, 1:405

సువార్తసేవకు వెళ్తున్న బ్రిగమ్ మరియు హీబర్.

బ్రిగమ్ మరియు హీబర్‌లు వారి భార్యలకు వీడ్కోలు చెప్పి, బండి వెనుకభాగంలో ఎక్కారు. అంత అనారోగ్యంలో, పేదరికంలో వారి కుటుంబాలను వదిలివెళ్తున్నందుకు వారు బాధపడ్డారు. బండి ముందుకు కదిలినప్పుడు, “ఇది చాలా కష్టం,” అని బ్రిగమ్‌తో అన్నాడు హీబర్. వారి కుటుంబాలు ధైర్యంగా భావించేలా అతను సహాయపడాలనుకున్నాడు. డ్రైవర్‌ని బండి ఆపమని చెప్పాడు హీబర్.

Saints, 1:405-6

వీడ్కోలు చెప్పడానికి ఆగుతున్న బ్రిగమ్ మరియు హీబర్.

ఇంటి లోపల ఉన్న వైలేట్‌కు ఏదో శబ్దం వినిపించింది. ఆమె తలుపు దగ్గరికి వచ్చింది, అక్కడ మేరీ ఆన్ నిలబడి ఉంది. బండి వెనుక నిలబడి, హీబర్ మరియు బ్రిగమ్ వారి టోపీలను గాలిలో ఊపుతూ ఇలా అరవడం వారు చూసారు, “జయము! జయము! ఇశ్రాయేలుకు జయము!” “వీడ్కోలు! దేవుడు మిమ్మల్ని దీవిస్తారు!” అని ఆ స్త్రీలు జవాబిచ్చారు.

Saints, 1:406

గ్రేట్ బ్రిటన్‌లో సువార్తను ప్రకటిస్తున్న బ్రిగమ్ మరియు హీబర్.

సముద్రం మీదుగా సుదీర్ఘ ప్రయాణం తర్వాత, హీబర్ మరియు బ్రిగమ్ గ్రేట్ బ్రిటన్‌కు చేరుకున్నారు. ఇతర అపొస్తలులతో కలిసి, వారు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి అనేకమందికి బోధించారు. వేలమంది బాప్తిస్మం పొంది, రక్షకుని సంఘములో చేరారు.

Saints, 1:408-11

నావూలో నివసించడానికి ప్రయాణిస్తున్న పరిశుద్ధులు.

గ్రేట్ బ్రిటన్‌లో బాప్తిస్మం పొందిన అనేకమంది నావూ పట్టణాన్ని మరియు దేవాలయాన్ని నిర్మించడంలో సహాయపడడానికి అక్కడికి వెళ్ళారు. హీబర్ మరియు బ్రిగమ్‌లు ఆయన సువార్తికులుగా సేవచేస్తున్నప్పుడు, వారి కుటుంబాలను చూసుకుంటానని ప్రభువు వారికిచ్చిన తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.

Saints, 1:437-39