“జోసెఫ్, సిడ్నీలు పరలోకం గురించి నేర్చుకుంటారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“జోసెఫ్, సిడ్నీలు పరలోకం గురించి నేర్చుకుంటారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1832 ఫిబ్రవరి
జోసెఫ్, సిడ్నీలు పరలోకం గురించి నేర్చుకుంటారు
ఆయన పిల్లల కొరకు దేవుని దీవెనల గురించి ఒక దర్శనము
ఒక రోజు, జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్ బైబిలు చదువుతున్నారు. మనుష్యులు చనిపోయిన తర్వాత వారికి ఏమి జరుగుతుందనే దాని గురించి వారు చదివారు. జోసెఫ్ మరియు సిడ్నీ వారు చదివిన దాని గురించి ఆలోచించారు మరియు వారు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:11–18
ప్రభువు వారికి అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చారు. వారు దేవదూతలతో చుట్టబడియున్న పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుని చూసారు. యేసు దేవుని కుమారుడని చెప్తున్న ఒక స్వరాన్ని వారు విన్నారు. యేసు మనకొరకు చనిపోయారని, ఆ తర్వాత పునరుత్థానుడయ్యారని—ఆయన తిరిగి జీవించారని ఆ స్వరం చెప్పింది. ఆయన అలా చేసారు కాబట్టి, మనం కూడా పునరుత్థానం చెందుతాము.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:19–24, 39–43
మనం పునరుత్థానం చెందిన తర్వాత, మనం పరలోకంలోని రాజ్యాలు అని పిలువబడే మూడు ప్రదేశాలలో ఒకదానిలో నివసిస్తామని జోసెఫ్ మరియు సిడ్నీ తెలుసుకున్నారు. యేసు క్రీస్తు సువార్తను అంగీకరించని వ్యక్తులు టిలెస్టియల్ రాజ్యానికి వెళతారు. ప్రభువు ఈ రాజ్యాన్ని నక్షత్రాల వెలుగుతో పోల్చారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:81–86
టెర్రెస్ట్రియల్ రాజ్యం అనే రాజ్యం గురించి కూడా జోసెఫ్ మరియు సిడ్నీ తెలుసుకున్నారు. ఈ రాజ్యం మంచి జీవితాలను జీవించినప్పటికీ యేసు క్రీస్తు సువార్తకు పూర్తిగా విధేయులు కాని వారి కోసమైనది. వారు ఆయనపై తమ విశ్వాసంలో బలంగా లేరు. ప్రభువు ఈ రాజ్యాన్ని చంద్రుని వెలుగుతో పోల్చారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:71–80
అత్యున్నతమైన రాజ్యం సిలెస్టియల్ రాజ్యం. ఈ రాజ్యంలో ఉన్న జనులు దేవునితో నిబంధనలు లేదా వాగ్దానాలు చేసారు మరియు వారి నిబంధనలను పాటించారు. వారు పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తును అనుసరించారు. వారు పరలోక తండ్రి మరియు యేసుతో ఎప్పటికీ జీవిస్తారు మరియు వారిలాగే మారతారు. ప్రభువు ఈ రాజ్యాన్ని సూర్యుని వెలుగుతో పోల్చారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:50–70
వారి దర్శనంలో చూసిన ప్రతిదానిని పంచుకోవద్దని ప్రభువు జోసెఫ్ మరియు సిడ్నీలతో చెప్పారు. కానీ వారు దాని గురించి కొంత వ్రాసి ఇతరులతో పంచుకోవాలని ఆయన కోరుకున్నారు. సంఘములో చాలా మంది సభ్యులు దర్శనం గురించి జనులకు చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:113–119; Saints, 1:149–50
కొంతమందికి దర్శనం నచ్చలేదు. వారు నమ్మిన దానికంటే అది వేరుగా ఉంది. కానీ పరిశుద్ధులలో చాలా మంది ఈ బయల్పాటు గురించి తెలుసుకున్నందుకు కృతజ్ఞత కలిగియున్నారు. పరలోక తండ్రి తన పిల్లలను ప్రేమిస్తున్నారని మరియు వారు ఆయన వద్దకు తిరిగి వెళ్ళడానికి ఒక మార్గాన్ని రూపొందించారని అది వారికి చూపించింది.
Saints, 1:149–50