“బహు వివాహము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“బహు వివాహము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1831–1890
బహు వివాహము
కొంత కాలము కొరకు ఆజ్ఞ
ప్రవక్త జోసెఫ్ బైబిలు చదువుతున్నప్పుడు, ఒకరి కంటే ఎక్కువమంది భార్యలను వివాహం చేసుకున్న అబ్రాహాము మరియు మోషే వంటి ప్రవక్తల గురించి చదివారు. జోసెఫ్‌కు చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రార్థించి, ప్రభువును అడగాలని నిర్ణయించుకున్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 132:1; Saints, 1:121, 503
సాధారణంగా ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాలని ప్రభువు చెప్పారు. కానీ కొన్నిసార్లు ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువమంది భార్యలను వివాహం చేసుకోవాలని ప్రభువు ఆజ్ఞాపించారు. దీనిని బహు వివాహం అని పిలుస్తారు. ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆయన ప్రజలు బహు వివాహం చేసుకోవాలని ప్రభువు జోసెఫ్‌తో చెప్పారు.
జేకబ్ 2:27–30; సిద్ధాంతము మరియు నిబంధనలు 132:34–39; Saints, 1:121, 290–91, 489–90, 503
కొన్ని సంవత్సరాల తరువాత, ప్రభువు జోసెఫ్ మరియు మరికొందరు పరిశుద్ధులకు బహు వివాహం చేసుకోమని చెప్పారు. ఈ ఆజ్ఞను పాటించడం అంత సులభం కాదు.
Saints, 1:290–91, 444–46
ప్రభుత్వం బహు వివాహానికి వ్యతిరేకంగా చట్టాలను చేసింది. సంఘ నాయకులతో సహా కొంతమంది పరిశుద్ధులను జైలులో పెట్టారు.
Saints, 2:501–4
1890లో, పురుషులు ఇకపై ఒకరి కంటే ఎక్కువమంది భార్యలను వివాహం చేసుకోకూడదని సంఘ అధ్యక్షుడైన విల్ఫర్డ్ వుడ్రఫ్‌తో ప్రభువు చెప్పారు. సంఘ నాయకులు ఈ ఆజ్ఞను పరిశుద్ధులతో పంచుకున్నారు. ఇది నేటికీ ప్రభువు యొక్క ఆజ్ఞ—ఒక పురుషుడు ఒకే భార్యను వివాహం చేసుకోవాలి.
అధికారిక ప్రకటన 1; Saints, 2:598–601, 607–9