“టెలీ ప్రభువుకు సేవ చేస్తుంది,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“టెలీ ప్రభువుకు సేవ చేస్తుంది,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1844 ఏప్రిల్–1852 మార్చి
టెలీ ప్రభువుకు సేవ చేస్తుంది
టుబువాయిలో సంఘ నిర్మాణం
టెలీ అనే ఒక స్త్రీ టుబువాయి అనే చిన్న దీవిలో నివసించింది. వివిధ సంఘాల నుండి సువార్తికులు కొన్నిసార్లు టుబువాయిని సందర్శించేవారు, కానీ వారు సాధారణంగా ఎక్కువసేపు ఉండరు. 1844లో ఒక రోజు, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము నుండి సువార్తికులు టుబువాయికి వచ్చారని విని టెలీ ఉత్సాహంగా ఉంది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 1:1; 133:8
సువార్తికులు కొన్ని పెద్ద దీవులకు వెళ్ళే దారిలో ఉన్నారు. కానీ వారు అక్కడే ఉండి సువార్త బోధించాలని టుబువాయిలోని ప్రజలు కోరుకున్నారు. సువార్తికులు తమ ఇంట్లో ఉండవచ్చని టెలీ మరియు ఆమె భర్త నబోటా చెప్పారు. సువార్తికులలో ఒకడైన అడిసన్ ప్రాట్ అంగీకరించాడు.
Saints, 1:573–74
టెలీ మరియు నబోటా తమ దగ్గర ఉన్నవన్నీ అడిసన్‌తో పంచుకున్నారు. వారు అతనికి తమ భాష మాట్లాడడం నేర్పించారు. అడిసన్ వారికి యేసు క్రీస్తు గురించి నేర్పించాడు.
రక్షకుని సువార్త సత్యమని పరిశుద్ధాత్మ టెలీ మరియు నబోటాకు చెప్పారు. టుబువాయిలో బాప్తిస్మం తీసుకున్న మొదటి వ్యక్తులు వారే.
Saints, 1:573–74
టెలీ, నబోటా మరియు అడిసన్ గొప్ప స్నేహితులయ్యారు. వారు కలిసి ప్రయాణించి టుబువాయిలో మరియు ఇతర దీవులలో సువార్త బోధించారు. వారు సంఘంలో చేరకూడదని ప్రజలు టుబువాయిలోని పరిశుద్ధులకు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, సంఘము సత్యమని టెలీ వారికి లేఖనాల నుండి బోధించింది.
Saints, 2:27, 45
టుబువాయిలోని ఎక్కువ మంది ప్రజలకు యేసు క్రీస్తు సువార్తను నేర్చుకోవడంలో టెలీ సహాయం చేయాలనుకుంది. ఆమె లేఖనాలను సంగీతానికి అనుగుణంగా అమర్చి, సాయంత్రాల్లో తనతో కలిసి పాడడానికి పెద్ద సమూహాలను ఆహ్వానించింది. టెలీ యొక్క పాటలు పాడడం చాలామందికి లేఖనాల నుండి నేర్చుకోవడానికి మరియు వారు నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోవడానికి సహాయపడింది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 25:12
కొన్ని సంవత్సరాల తరువాత, అడిసన్ కుటుంబంతో సహా ఎక్కువ మంది సువార్తికులు టుబువాయికి వచ్చారు. టెలీ వారిని తన ఇంటికి ఆహ్వానించింది. ఆమె అడిసన్ భార్య లూయిసాతో కలిసి టుబువాయి మహిళలకు సేవ చేయడానికి పనిచేసింది.
Saints, 2:133–34
కొంతకాలం తర్వాత, సువార్తికులు టుబువాయిని మరియు ఇతర దీవులను వదిలి వెళ్ళవలసి వచ్చింది. కానీ టెలీ పరిశుద్ధులకు బోధించడం మరియు నాయకత్వం వహించడం కొనసాగించింది. టెలీ యొక్క మాదిరి మరియు సేవ కారణంగా, టుబువాయిలోని సంఘము బలంగా ఉంది.
Saints, 2:150–51