లేఖన కథలు
ఉపశమన సమాజము


“ఉపశమన సమాజము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“ఉపశమన సమాజము,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1842 మార్చి

3:38

ఉపశమన సమాజము

ప్రభువును సేవిస్తున్న నావూ స్త్రీలు

నావూలో నిర్మించబడబోతున్న కొత్త దేవాలయం గురించి మాట్లాడుతున్న మార్గరెట్ కుక్ మరియు శారా కింబల్.

మార్గరెట్ కుక్ నావూలో నివసించేది. ఆమె కుట్టుపనిలో సహాయం చేస్తూ, శారా కింబల్ దగ్గర పనిచేసేది. ఆమె పనిచేస్తున్నప్పుడు, నావూలో నిర్మించబడబోతున్న కొత్త దేవాలయం గురించి మాట్లాడుకోవడం వారికిష్టం. వారు దేవాలయం గురించి ఉత్సాహంగా ఉన్నారు.

Saints, 1:447

దేవాలయ పనివారు పాత బట్టలు వేసుకోవడాన్ని గమనించిన మార్గరెట్.

ఒకరోజు, దేవాలయాన్ని నిర్మిస్తున్న మగవారిలో అనేకమంది పాత మరియు చిరిగిన బట్టలు వేసుకోవడాన్ని మార్గరెట్ గమనించింది. ఆమె మరియు శారా కలిసి వారి కోసం కొత్త చొక్కాలు కుట్టిస్తే బాగుంటుందని ఆమె అనుకుంది. శారాకి ఆ ఆలోచన నచ్చింది. పనివారికి సహాయం చేయడానికి ఒక సమూహంగా ఏర్పడడం గురించి ఆమె మరియు మార్గరెట్ ఇతర స్త్రీలతో మాట్లాడారు.

Saints, 1:447-48

సంఘము యొక్క ఉపశమన సమాజమును ఏర్పాటు చేయడానికి మార్గరెట్, శారా మరియు ఇతరులను కలుసుకుంటున్న జోసెఫ్ స్మిత్.

ప్రభువు వారి ఆలోచన పట్ల సంతోషంగా ఉన్నారని మరియు వారికోసం ఇంకా ఉత్తమమైనది ఆయన కలిగియున్నారని ప్రవక్త జోసెఫ్ చెప్పారు. 1842, మార్చి 17న ఆయనను కలుసుకోవాలని జోసెఫ్ ఆ స్త్రీలను ఆహ్వానించారు. యాజకత్వ అధికారాన్ని ఉపయోగిస్తూ, ఆయన సంఘము యొక్క స్త్రీలను ఒక సమూహంగా ఏర్పాటు చేసారు. వారి సమూహాన్ని నావూ యొక్క మహిళా ఉపశమన సమాజము అని పిలవాలని వారు నిర్ణయించుకున్నారు.

Saints, 1:448, 450-51

ఇద్దరు స్త్రీలతో మాట్లాడుతున్న మార్గరెట్.

దేవాలయము మరియు నిత్య జీవము యొక్క దీవెనల కోసం సిద్ధపడడంలో జనులకు సహాయపడమని జోసెఫ్ ఉపశమన సమాజమును అడిగారు. యేసును అనుసరించడంలో వారు మాదిరికరంగా ఉండాలి.

Saints, 1:451

అవసరంలో ఉన్న ఒక కుటుంబానికి ఆహారం తీసుకొస్తున్న ఉపశమన సమాజ సభ్యులు.

ఉపశమన సమాజము బీదవారిని కనుగొని, వారికి సహాయపడాలని కూడా జోసెఫ్ చెప్పారు. అవసరంలో ఉన్న జనులకు సహాయపడాలని పేద స్త్రీలు కూడా కోరుకున్నారు.

Saints, 1:449

ఏర్పాటు చేయబడుతున్న ఉపశమన సమాజము.

ఉపశమన సమాజము ఏర్పాటు చేయబడింది. ఎమ్మా స్మిత్ అధ్యక్షురాలిగా పిలువబడింది. ఆమె ఇద్దరు సలహాదారిణీలను పిలిచింది, శారా క్లీవ్‌లాండ్ మరియు ఆన్ విట్నీ. ఆమె ఒక కార్యదర్శిని కూడా పిలిచింది, ఎలైజా ఆర్. స్నో.

Saints, 1:450

ఉపశమన సమాజములోని స్త్రీలకు బోధిస్తున్న ఎమ్మా.

ఆమె పిలుపును నెరవేర్చడానికి ప్రభువు ఎమ్మాకు సహాయం చేసారు. ప్రభువు యొక్క సేవలో వారు గొప్ప పనులు చేయగలరని ఎమ్మా స్త్రీలకు బోధించింది. మంచి చేయడానికి మార్గాలు వెదకమని వారిలో ప్రతీఒక్కరిని ఆమె కోరింది. అతి ముఖ్యంగా, ఇతరులను యేసు ప్రేమించినట్లుగా ప్రేమించాలని ఆమె వారికి చెప్పింది. నావూలో అనేకమంది స్త్రీలు ఉపశమన సమాజములో చేరారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 25:3, 7; Saints, 1:451

సంఘములోని స్త్రీలు ప్రపంచవ్యాప్తంగా జనులకు ఎలా సహాయపడ్డారో వర్ణించే సమగ్ర చిత్ర వివరణ.

దేవాలయ దీవెనల కొరకు సిద్ధపడేందుకు జనులకు వారు సహాయపడ్డారు మరియు నావూలో అవసరంలో ఉన్న అనేక కుటుంబాలకు సహాయం చేసారు. అప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఉపశమన సమాజములో చేరారు. వారు జనులకు సేవచేయడం కొనసాగించారు మరియు దేవాలయ దీవెనలు పొందడానికి వారికి సహాయం చేసారు.

Saints, 1:451