“జోసెఫ్ మరియు హైరంలు సువార్త కోసం తమ ప్రాణాలను అర్పిస్తారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)
“జోసెఫ్ మరియు హైరంలు సువార్త కోసం తమ ప్రాణాలను అర్పిస్తారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు
1844 మార్చి–జూన్
జోసెఫ్ మరియు హైరంలు సువార్త కోసం తమ ప్రాణాలను అర్పిస్తారు
ప్రవక్త మరణిస్తారు, కానీ ప్రభువు పని కొనసాగుతుంది
జోసెఫ్ స్మిత్ విచారంగా ఉన్నారు. ఆయన మరణిస్తే, సంఘానికి ఏమవుతుంది? ప్రభువు పని కొనసాగేలా నిశ్చయపరచాలని ఆయన కోరుకున్నారు. కాబట్టి, ఆయన అపొస్తలులను సమకూర్చి, యేసు క్రీస్తు ఆయనకు ఇచ్చిన యాజకత్వ తాళపుచెవులను వారికి ఇచ్చారు. దీని అర్థం అపొస్తలులు ప్రభువు యొక్క సంఘాన్ని నడిపించగలరు మరియు ఆయన పనిని చేయగలరు. ఇది జోసెఫ్ మంచిగా భావించేలా చేసింది.
Saints, 1:519-20
కానీ చాలామంది జోసెఫ్‌పై కోపంగా ఉన్నారు. కొందరు ఆయన్ని చంపాలనుకున్నారు. ఆయన బోధించిన దానిని వారు ఇష్టపడలేదు. ఇంకా ఎక్కువమంది జోసెఫ్‌పై మరియు సంఘముపై కోపగించుకునేలా చేయడానికి వారు ఆయన గురించి ఒక వార్తాపత్రికలో వ్రాసారు. వారిలో కొందరు నావూపై దాడి చేయాలనుకున్నారు.
Saints, 1:526–28, 530–32, 533–34
ద్వేషం ఎక్కువ కాకుండా ఆపడానికి జోసెఫ్ మరియు నావూలోని ఇతర నాయకులు ముద్రణాలయాన్ని ధ్వంసం చేశారు. ఇది జనుల కోపాన్ని ఇంకా పెంచింది. ఆయన చట్టాన్ని ఉల్లఘించారో లేదో ఒక జడ్జి నిర్ణయించగలిగేలా ఆయన కార్తేజ్ పట్టణానికి వెళ్ళాలని గవర్నర్ జోసెఫ్‌తో చెప్పారు. కార్తేజ్‌కి వెళ్తే, జనులు ఆయన్ని చంపేస్తారని జోసెఫ్‌కు తెలుసు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 135:4; Saints, 1:533–37, 539–41
కానీ పరిశుద్ధులు సురక్షితంగా ఉండాలని జోసెఫ్ కోరుకున్నారు. ఆయన కార్తేజ్‌కి వెళ్తే, జనులు నావూలోని పరిశుద్ధులను విడిచిపెడతారేమో. జోసెఫ్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఆయన ఎమ్మాను, తన పిల్లలను దీవించి, వారిని ముద్దుపెట్టుకొని, కార్తేజ్‌కి బయలుదేరారు.
Saints, 1:542-44
జోసెఫ్ అన్న హైరం ఆయనతో వెళ్ళాడు. అలాగే జాన్ టేలర్, విల్లార్డ్ రిఛర్డ్స్ మరియు ఇతర స్నేహితులు కూడా. వారు వెళ్ళేటప్పుడు, జోసెఫ్ తన గుర్రాన్ని ఆపి, నావూ వైపు చూసారు. “ఇది అత్యంత అందమైన ప్రదేశం మరియు పరలోకాల క్రింద ఉన్న ఉత్తమ వ్యక్తులు,” అని అన్నారాయన.
Saints, 1:543–45
వారు కార్తేజ్‌కు చేరుకున్నప్పుడు, వారు చెరసాలలో వేయబడ్డారు. వారు చెరసాలలో ఉన్నప్పుడు, హైరం మోర్మన్ గ్రంథము నుండి చదివి వినిపించాడు. మోర్మన్ గ్రంథము సత్యమని జోసెఫ్ కాపలాదారులకు చెప్పారు.
Saints, 1:546
తన స్నేహితులకు ఓదార్పునివ్వడానికి, జాన్ టేలర్ యేసు గురించి ఒక కీర్తన పాడాడు. అది చాలా బాగుంది మరియు దానిని మళ్ళీ పాడమని హైరం అతన్ని అడిగాడు.
Saints, 1:549
తరువాత ఆ రోజు, కోపంతో ఉన్న మనుషులు చెరసాలలోకి దూసుకొచ్చారు. వారు తలుపును తోసుకుంటూ, జోసెఫ్ మరియు ఆయన స్నేహితులు ఉన్న గదిలోకి కాల్పులు జరపడం మొదలుపెట్టారు. జాన్ టేలర్ బాగా గాయపడ్డాడు. హైరం మరియు జోసెఫ్ చంపబడ్డారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 135:1–2; Saints, 1:550-52
జోసెఫ్ మరియు హైరంలు చనిపోయారని తెలుసుకున్నప్పుడు పరిశుద్ధులు చాలా బాధపడ్డారు. కానీ ప్రవక్తను చంపడం సంఘాన్ని ఆపలేదని వారికి తెలుసు. ఇది రక్షకుని సంఘము మరియు ఆయన దీన్ని నడిపించడం కొనసాగిస్తారు. సంఘము అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మరియు ప్రపంచవ్యాప్తంగా దేవుని పిల్లలను దీవిస్తూనే ఉంటుంది.
Saints, 1:553-59