లేఖన కథలు
డెసిడెరియా యొక్క కల


“డెసిడెరియా యొక్క కల,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“డెసిడెరియా యొక్క కల,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1880–1886

3:7

డెసిడెరియా యొక్క కల

మెక్సికోలో ప్రభువుచేత నడిపించబడింది

కలగంటున్న డెసిడెరియా యానియాస్.

డెసిడెరియా యానియాస్ మెక్సికోలోని నోపాలాలో నివసించేది. ఒక రాత్రి, మెక్సికో నగరంలో ఒక చిన్న పుస్తకం తయారు చేయబడుతోందని డెసిడెరియా కలగన్నది. అది Voz de amonestación లేదా హెచ్చరిక స్వరము అని పిలువబడింది. డెసిడెరియా మేల్కొన్నప్పుడు, ఆమె ఆ పుస్తకాన్ని కనుగొనాలని ఆమెకు తెలుసు.

Saints, 2:477

కల గురించి తన కొడుక్కి చెప్తున్న డెసిడెరియా.

కానీ మెక్సికో నగరం చాలా దూరంలో ఉంది మరియు డెసిడెరియా అంత పెద్ద వయసులో అంత దూరం ప్రయాణించలేకపోయింది. ఆ పుస్తకాన్ని కనుగొనాలని ప్రభువు ఆమెను కోరుతున్నట్లుగా ఆమె భావించింది. కాబట్టి ఆమె తన కొడుకు హోసే‌కు కల గురించి చెప్పింది. అతను కూడా ఆ పుస్తకం ముఖ్యమైనదని నమ్మాడు. ఆమె కోసం ఆ పుస్తకాన్ని కనుగొంటానని అతను తన తల్లితో చెప్పాడు.

Saints, 2:478

మెక్సికో నగరానికి చేరుకున్న హోసే.

హోసే మెక్సికో నగరానికి చేరుకున్నప్పుడు, వీధులు రద్దీగా, గోలగోలగా, జనంతో నిండి ఉన్నాయి. అంత రద్దీగా ఉన్న ప్రదేశంలో అతను ఆ పుస్తకాన్ని ఎలా కనుగొనగలడు?

Saints, 2:478

జేమ్స్ స్టీవార్ట్‌ను కలుసుకుంటున్న హోసే.

కొన్ని రోజుల తర్వాత, హోసే జేమ్స్ స్టీవార్ట్ అనే సువార్తికుడిని కలిశాడు. Voz de amonestación అనే పుస్తకాన్ని ముద్రించే పనిలో ఉన్నానని జేమ్స్ చెప్పాడు.

Saints, 2:478

మోర్మన్ గ్రంథం గురించి మాట్లాడుతున్న జేమ్స్.

హోసే చాలా ఉత్సాహంగా ఉన్నాడు! అతను తన తల్లి కల గురించి జేమ్స్‌తో చెప్పాడు. సువార్తికులు యేసు క్రీస్తు గురించి మరియు మోర్మన్ గ్రంథము అనే కొత్త లేఖన గ్రంథం గురించి ప్రజలకు బోధించడానికి Voz de amonestación‌ను ఉపయోగిస్తారని జేమ్స్ వివరించాడు.

Saints, 2:478

సువార్త గురించి తెలుసుకోవడానికి హోసే‌కు పుస్తకాలు ఇస్తున్న జేమ్స్.

Voz de amonestación ఇంకా పూర్తి కాలేదు మరియు మోర్మన్ గ్రంథము స్పానిష్‌ భాషలోకి అనువదించబడలేదు. కానీ యేసు క్రీస్తు, మోర్మన్ గ్రంథము మరియు పునఃస్థాపించబడిన సంఘము గురించి తెలుసుకోవడానికి హోసేకు మరియు అతని తల్లికి సహాయపడేందుకు జేమ్స్ ఇతర పుస్తకాలు మరియు పత్రాలు ఇచ్చాడు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:11; Saints, 2:478–79

కలిసి సువార్త గురించి నేర్చుకుంటున్న హోసే మరియు అతని తల్లి.

హోసే త్వరగా ఇంటికి తన తల్లి వద్దకు వెళ్ళాడు. వారు కలిసి సువార్తను అధ్యయనం చేశారు మరియు అది నిజమని వారికి తెలుసు. డెసిడెరియా తనకు బాప్తిస్మం ఇవ్వడానికి సువార్తికులను రమ్మని అడిగింది.

Saints, 2:479

బాప్తిస్మం తీసుకుంటున్న డెసిడెరియా, హోసే మరియు హోసే కూతురు కార్మెన్.

మెక్సికోలో బాప్తిస్మం తీసుకున్న మొదటి మహిళలలో డెసిడెరియా ఒకరు. హోసే మరియు అతని కూతురు కూడా బాప్తిస్మం తీసుకున్నారు.

Saints, 2:479

మోర్మన్ గ్రంథము యొక్క ప్రతిని అందుకుంటున్న డెసిడెరియా.

Voz de amonestación పూర్తయిన తర్వాత, తన తల్లి నోపాలాలో ఇతరులతో పంచుకోవడానికి హోసే 10 ప్రతులను తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత, మోర్మన్ గ్రంథము చివరకు స్పానిష్‌ భాషలో ముద్రించబడినప్పుడు, మెక్సికోలో ఒక ప్రతిని అందుకున్న మొదటి వ్యక్తి డెసిడెరియా. ప్రభువు ఆమెను పునఃస్థాపించబడిన తన సంఘానికి నడిపించారని ఆమెకు తెలుసు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 88:81; Saints, 2:479