లేఖన కథలు
న్యూయెల్ మరియు ఆన్ విట్నీ ప్రవక్త జోసెఫ్‌ను కలుసుకుంటారు


“న్యూయెల్ మరియు ఆన్ విట్నీ ప్రవక్త జోసెఫ్‌ను కలుసుకుంటారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు (2024)

“న్యూయెల్ మరియు ఆన్ విట్నీ ప్రవక్త జోసెఫ్‌ను కలుసుకుంటారు,” సిద్ధాంతము మరియు నిబంధనల కథలు

1830 అక్టోబరు–1831 ఫిబ్రవరి

2:25

న్యూయెల్ మరియు ఆన్ విట్నీ ప్రవక్త జోసెఫ్‌ను కలుసుకుంటారు

విశ్వాసము గల ప్రార్థనలకు ప్రభువు జవాబిస్తారు

ప్రార్థిస్తున్న ఆన్ మరియు న్యూయెల్ విట్నీ.

ఆన్ మరియు న్యూయెల్ విట్నీలకు ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో ఒక దుకాణం ఉంది. ఆన్ పెరుగుతున్న వయస్సులో సంఘానికి వెళ్లలేదు లేదా ప్రభువు గురించి నేర్చుకోలేదు, కానీ ఆయన గురించి ఆమె తెలుసుకోవాలనుకుంది. ఆమె మరియు న్యూయెల్ పెళ్ళి చేసుకున్న తర్వాత, వారు చాలాసార్లు ప్రార్థించారు మరియు తమను నడిపించమని ప్రభువును కోరారు.

Saints, 1:111–12

దర్శనమును చూస్తున్న ఆన్ మరియు న్యూయెల్.

ఒక రాత్రి వారు ప్రార్థిస్తున్నప్పుడు, ఆన్ మరియు న్యూయెల్ ఒక దర్శనం చూసారు. దర్శనంలో, ఒక మేఘం వారి ఇంటిపై నిలిచింది. దేవుని ఆత్మ వారిని నింపింది. మేఘం వారిని చుట్టుముట్టింది. అప్పుడు వారు పరలోకం నుండి ఒక స్వరం విన్నారు. అది వారితో ఇలా చెప్పింది, “ప్రభువు వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడండి, ఎందుకంటే అది వస్తోంది.”

Saints, 1:111

పార్లీ ప్రాట్ నుండి సువార్త గురించి తెలుసుకుంటున్న ఆన్.

కొంతకాలం తర్వాత, పార్లీ ప్రాట్ కర్ట్‌లాండ్‌కు వచ్చారు. అతను మరియు అతని సహచరులు యేసు క్రీస్తు సువార్తను బోధించారు. వారు బోధించినది విన్న వెంటనే, అది నిజమని ఆన్‌కు తెలిసింది. న్యూయెల్‌తో ఆ వార్త పంచుకోవడానికి ఆమె ఇంటికి వెళ్లింది. త్వరలోనే వారు బాప్తిస్మం తీసుకున్నారు.

Saints, 1:112

ఆన్ మరియు న్యూయెల్‌ను కలుసుకున్న జోసెఫ్ మరియు ఎమ్మా స్మిత్.

రెండు నెలల తర్వాత, ఒక పురుషుడు మరియు స్త్రీ న్యూయెల్ దుకాణానికి వచ్చారు. న్యూయెల్‌కి వారెవరో తెలియదు, కానీ ఆ వ్యక్తి న్యూయెల్‌‌తో కరచాలనం చేసి న్యూయెల్‌ని పేరుపెట్టి పిలిచాడు. ఆ వ్యక్తి, “నేను ప్రవక్త జోసెఫ్‌ను” అన్నాడు. న్యూయెల్ ప్రార్థనలకు ప్రభువు జవాబిస్తున్నారు. ఆయన ఎమ్మా మరియు జోసెఫ్‌లను ఆన్ మరియు న్యూయెల్‌లను కలవడానికి పంపారని అతడు వివరించాడు.

Saints, 1:113

వారితోపాటు ఉండడానికి జోసెఫ్ మరియు ఎమ్మా స్మిత్‌లను ఆహ్వానిస్తున్న ఆన్ మరియు న్యూయెల్.

న్యూయెల్ మరియు ఆన్‌కి వారి దర్శనం నిజమవుతుందని తెలుసు. వారు జోసెఫ్ మరియు ఎమ్మాలను తమతోపాటు తమ ఇంట్లో ఉండమని కోరారు. ఆన్ మరియు న్యూయెల్‌లు యేసును, ఆయన సువార్తను ప్రేమించారు. వారు తమ దగ్గర ఉన్నదంతా పరిశుద్ధులకు మరియు రక్షకుని సంఘానికి ఇచ్చారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 38:23–27, 34–42; Saints, 1:114